అంగన్వాడీ ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : అంగన్వాడీ ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, హెల్పర్ పోస్టులు భర్తీ చేయాలని సిఐటియు వనపర్తి జిల్లా అధ్యక్షులు మండ్ల రాజు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్( సిఐటియు అనుబంధం) వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా 2024 జనవరి న రాష్ట్ర ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చి నేటికీ ప్రమోషన్ జీతాలు ఇవ్వడం లేదు. బకాయి పడ్డ ఐదు నెలల వేతనాలు చెల్లించాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, హెల్పర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్లతో వనపర్తి కలెక్టర్ కార్యాలయంలో ఏవో కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు వనపర్తి జిల్లా అధ్యక్షులుమండ్ల రాజు ప్రసంగిస్తూ 2024 జనవరి నెలలో గత అనేక సందర్భాలుగా దశల వారి పోరాటాలు నిర్వహించగా ఫలితంగా మినీ అంగన్వాడి కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది .కానీ మార్చి, ఏప్రిల్, జూలై ,ఆగస్టు, సెప్టెంబర్ గత ఐదు నెలల వేతనాలు మినీ టీచర్ వేతనాలు చెల్లించడం జరిగింది. ఆర్థిక శాఖలో అప్డేట్ కాలేదని పూర్తి జీతం ఇవ్వలేదు. దాంతో మినీ అంగన్వాడీ టీచర్లు హెల్పర్ విధులు, టీచర్ విధులు నిర్వహిస్తూ అనేక రకాల ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు .రాష్ట్రంలో 4,000 మంది వనపర్తి జిల్లాలో 42 మంది మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇట్టి కేంద్రాలలో నేటికీ మినీ టీచర్లే రెండు విధులు నిర్వహిస్తున్నారు. కాబట్టి వెంటనే హెల్పర్ పోస్టులు భర్తీ చేయాలని, గత 15 సంవత్సరాలుగా అంగన్వాడీ డిపార్ట్మెంట్లో ఖాళీలను భర్తీ చేయడం లేదు. కాబట్టి వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బిలి నిక్సన్ వనపర్తి ప్రాజెక్టు అధ్యక్షులు జి. జ్యోతి, యూనియన్ నాయకులు కవిత అనిత సరోజ లక్ష్మి సుమిత్ర కవిత ఈజ్జా తదితరులు పాల్గొన్నారు. (Story : అంగన్వాడీ ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి)