రెండు దేవాలయాలలో చోరీ
బంగారు, 80000 నగదు చోరీ
రూరల్ పోలీసులు కేసు నమోదు చేసిన వైనం
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : మండల పరిధిలోని గొట్లురు గ్రామంలో గల రెండు దేవాలయాలలో ఆదివారం రాత్రి గోట్లురు గ్రామం నుండి మల్కాపురం వెళ్లే దారిలో గల శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయము, శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయములలో దొంగలు చొరబడి బంగారము నగదు తీసుకొని వెళ్ళారు. స్థానికులు ఆలయ అర్చకులు రూరల్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. దీంతో రూరల్ ఎస్సై శ్రీనివాసులు అక్కడికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ సుమారు 10 గ్రాముల బంగారం, హుండీ లోని డబ్బులను దోచుకొని వెళ్లడం జరిగిందని తెలిపారు. హుండీలో సుమారు 80 వేల వరకు ఉండవచ్చునని పోలీసులు తెలుపుతున్నారు. దీనిపై ఎస్సై శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. (Story : రెండు దేవాలయాలలో చోరీ)