రాష్ట్రస్థాయికి ఎంపికైన ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు
వ్యాయామ ఉపాధ్యాయులు నాగేంద్ర
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ప్రభుత్వ ఉన్నత పాఠశాల ధర్మవరం జిల్లాస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాల్ బాడ్మింటన్ అండర్ 14 అండర్ 17 అండర్ 19 విభాగాలలో జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి జరిగే పోటీలలో పాల్గొనడానికి క్రీడాకారులు ఎన్నిక కావడం జరిగిందని వ్యాయామ ఉపాధ్యాయులు నాగేంద్ర తెలిపారు.ఈ సందర్భంగా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు అయిన సీతారామయ్య,రమేష్ బాబు క్రీడాకారులను ప్రోత్సహిస్తూ తమ వంతు సహకారాన్ని అందిస్తూ రాష్ట్రస్థాయి లో ఉత్తమ ప్రతిభతో జాతీయస్థాయికి ఎన్నికవ్వాలని కోరారు.అండర్ 14 విభాగంలో మనోజ్ ,అశోక్ 6,7తేదీలలో అన్నమయ్య జిల్లా అంగల్లు లో ఆడుతారని, అండర్ 17 విభాగంలో సాయి ప్రసాద్ 9,10 తేదీలలో రాజమండ్రి ఆడుతారని,అండర్ 19 విభాగం లో చిరంజీవి, నిఖిల్ 9,10 తేదీలలో ఏలూరు జిల్లా పెద్ద వేగి లో ఆడుతారని తెలిపారు.ఎన్నికైన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని తెలుపుతూ ప్రభుత్వ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు నాగేంద్ర తోపాటు సీతారామయ్య, రమేష్ బాబులు హర్షం వ్యక్తం చేస్తూ క్రీడాకారులకు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. (Story : రాష్ట్రస్థాయికి ఎంపికైన ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు)