ఉద్యమకారుడు శ్రావణ్ కుమార్ ని పరామర్శించిన మాజీ మంత్రి
న్యూస్‌తెలుగు/వనపర్తి : గోపాల్ పేట మండల బుద్దారం గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ కారుడు,జిల్లా బి.ఆర్.ఎస్ యువ నాయకులు శ్రావణ్ కుమార్ కుమారుడు అనారోగ్యంతో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి పార్థీవ దేహాన్నికి నివాళులు అర్పించారు. శ్రావణ్ కుమార్ ను పరామర్శించి ఇది దురదృష్టకరం అని బాధావద్దు.ధైర్యంగా ఉండు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెంట మండల పార్టీ అధ్యక్షులు బి.బాలరాజు,మాన్యాణాయక్,మాజీ సర్పంచ్ వెంకటస్వామి,నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. (Story : ఉద్యమకారుడు శ్రావణ్ కుమార్ ని పరామర్శించిన మాజీ మంత్రి)