Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ 12 వ పి ఆర్ సి ని వెంటనే ప్రకటించాలి

12 వ పి ఆర్ సి ని వెంటనే ప్రకటించాలి

0

12 వ పి ఆర్ సి ని వెంటనే ప్రకటించాలి

యుటిఎఫ్. డిమాండ్

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) :  12వ పి ఆర్ సి ని వెంటనే ప్రకటించారని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు సెట్టిపి జయచంద్రారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం పట్టణంలోని స్థానిక యుటిఎఫ్ కార్యాలయం నందు ధర్మవరం, అర్బన్, మరియు రూరల్ కమిటీల ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిధులు గా జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయ చంద్రా రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ లు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ యుటిఎఫ్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 10 వ తేదీన కదిరి లో జిల్లా స్వర్ణోత్సవ మహా సభలు చేసుకుంటున్నామని, అందులో భాగంగా నేడు మండల కమిటీలు ఎన్నికల అధికారి రామకృష్ణ నాయక్ అధ్యక్షతన ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది అని తెలిపారు. ఎన్నికల పరిశీలకులుగా.మల్లేశు, పెద్దకోట్ల సురేష్ హాజరు కావడం జరిగిందన్నారు.
ప్రభుత్వ విద్యారంగా పరిరక్షణ కోసం యూటీఎఫ్ ఎంతో పోరాటం చేసిందని, ప్రభుత్వ బడులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 5 నెలలు కావస్తున్నా ఉద్యోగ ఉపాధ్యాయుల కు ప్రకటించలేదు. కాబట్టి 12 వ పి ఆర్ సి ని వెంటనే ప్రకటించాలి అని,ఉపాధ్యాయులకు 20వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సింది ఉందని, కేవలం 350 కోట్లు మాత్రమే చెల్లించారని తెలిపారు. మున్సిపల్ ఉపాధ్యాయులు సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, పిఆర్సి కమిషన్ వేసి I R 30 శాతం వెంటనే ప్రకటించాలని, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, బకాయిలు ఉన్న పీఎఫ్, ఏపీజేఎల్ఐసి చెల్లించాలని.ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఎన్నికైన నూతన సభ్యులు ఉపాధ్యాయ సమస్యల పట్ల విద్యారంగ పరిరక్షణకై తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. వివిధ మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ధర్మవరం పట్టణ నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా జింక హరికృష్ణ, పోసా సాయి గణేష్, ధర్మవరం రూరల్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఎం ఆంజనేయులు, జనార్దన్ బాబు ఎన్నికయ్యారు అని తెలిపారు. అలాగే ధర్మారం అర్బన్ గౌరవాధ్యక్షులుగా రామకృష్ణ నాయక్,ఉపాధ్యక్షులుగా ఆంజనేయులు, ఉపాధ్యక్షురాలుగా లతా దేవి, కోశాధికారిగా రామాంజనేయులు, జిల్లా కౌన్సిలర్లుగా మేరీ వర కుమారి, మణిమాల ,లక్ష్మయ్య ,రాంప్రసాద్, ధర్మవరం రూరల్ గౌరవ అధ్యక్షులుగా పూజారి విజయభాస్కర్, ఉపాధ్యక్షురాలుగా తులసి, ఉపాధ్యక్షులుగా వెంకట కిషోర్, కోశాధికారిగా అమర్ నారాయణరెడ్డి తదితరులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగిందని తెలిపారు. (Story : 12 వ పి ఆర్ సి ని వెంటనే ప్రకటించాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version