Home వార్తలు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలకు న్యాక్ బి గ్రేడ్ గుర్తింపు

ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలకు న్యాక్ బి గ్రేడ్ గుర్తింపు

0

ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలకు న్యాక్ బి గ్రేడ్ గుర్తింపు

న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) : ములుగు గిరిజన మహిళ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలకు న్యాక్ (నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్) బి గ్రేడ్ ప్రకటించింది అని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాధిక కే శనివారం ఒక పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ బి గ్రేడ్ రావడం వల్ల కళాశాల మరింత అభివృద్ధి చెంది, విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడానికి దోహదపడుతుందన్నారు. గత నెలలో న్యాక్ పీర్ బృందం అక్టోబర్ 23, 24 తేదీలలో కళాశాలను పరిశీలించిందని, వారు అందించిన నివేదికతో పాటు, కళాశాలలో ఉత్తమమైన బోధన, పరిసరాల పరిశుభ్రత ఇతర అనుకూలతలను పరిగణలోకి తీసుకొని,మన కళాశాలకు బి గ్రేడ్ ని ఇవ్వడం సంతోషకరం అన్నారు.ఎన్ఏఏసి బృందం వారు కళాశాలలో అందుతున్న సదుపాయాలు బోధన పద్ధతులు అవలంబిస్తున్న విధానాలను పరిశీలించిందన్నారు. అదేవిధంగా విద్య ప్రమాణాలు ఎలా ఉన్నాయని అధ్యయనం చేశారని తెలిపారు.నాణ్యత ప్రమాణాల ఆధారంగా గ్రేడ్లు కేటాయించేందుకు నివేదికను సీల్డ్ కవర్లో బెంగళూరులోని ఎన్ ఏఏ సి ప్రాంతీయ కార్యానికి పంపారని ప్రిన్సిపాల్ తెలియజేశారు. ఎన్ ఏ ఏ సి బృందంలో ప్రొఫెసర్ వెంకట చలపతి, వైస్ ఛాన్స్లర్ కర్పగం, అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తమిళనాడు, మెంబర్ కోఆర్డినేటర్ డాక్టర్ నారాయణ ప్రసాద్, ప్రొఫెసర్ ఇందిరాగాంధీ, నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ న్యూ ఢిల్లీ, అదేవిధంగా మెంబర్ గా డాక్టర్ సుధాకర్,ప్రిన్సిపల్ షేత్ జే ఎన్ పాలివాల కాలేజ్ పల్లి రాయగడ్ మహారాష్ట్ర నికి చెందినవారు ఆ బృందంలో ఉన్నట్లు తెలియజేశారు. వారికి ప్రిన్సిపల్ డాక్టర్ రాధిక గత ఐదేళ్లలో నిర్వహించిన ముఖ్యమైన కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కళాశాల నాణ్యత ప్రమాణాల గురించి వివరించారు. అదేవిధంగా ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ కళాశాల మరింత అభివృద్ధి చెందే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఎన్ ఏ ఏ సి బృందం వారు కళాశాలలోని వివిధ రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ అన్నింటిని తనిఖీ చేయడం జరిగింది. ఈ బృందం వారు విద్యార్థుల యొక్క నాణ్యత ప్రమాణాలు వారి యొక్క గ్రేడ్లు వారి యొక్క రిజల్ట్ యొక్క పర్సంటేజ్ ని అదే విధంగా కాలేజీ యొక్క రికార్డ్స్ ని మెయింటెనెన్స్ యొక్క పద్ధతులను కాలేజ్ యొక్క వాతావరణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారని పేర్కొన్నారు. ల్యాబ్స్ కూడా పరిశీలించారు. అదేవిధంగా విద్యార్థులతో విద్యార్థుల తల్లిదండ్రులతో పూర్వ విద్యార్థులతో కళాశాలలోను ఉద్యోగులతో వివిధ రకాల విభాగాల అధికారులతో సమావేశం అయ్యారు. పై అంశాలను అన్నింటినీ పరిగణలోకి తీసుకొని నాకు బృందం వారు బి గ్రేడ్ ని ఇవ్వడం సంతోషకరమైన విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతరులు పాల్గొన్నారు.(Story:ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలకు న్యాక్ బి గ్రేడ్ గుర్తింపు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version