ఘనంగా జరిగిన జల్ది పూజ జాతర కార్యక్రమం
న్యూస్ తెలుగు/విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని నాగుల భావి వీధి పేరు బజారులో గల శ్రీ నాగుల బావి గంగమ్మ తల్లి శ్రీ వీర దిమ్మమ్మ శ్రీ భైరవ స్వాముల వారి జల్దీ పూజ జాతర కార్యక్రమం అత్యంత వైభవంగా గుడికట్టు పూజారులు వీర నాగప్ప నాయుడు, పెద్దలు నిర్వహించారు. అనంతరం పూజారి వీర నాగప్ప నాయుడు, పెద్దలు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, మాత గోశాల ట్రస్ట్ చైర్మన్ నర్సింహారెడ్డి పాల్గొని గంగపూజను కూడా నిర్వహించారు అని తెలిపారు. ఈనెల 1వ తేదీ రాత్రి 7 గంటలకు వెళ్ళవగంప కార్యక్రమంతో ప్రారంభం అయ్యిందని తెలిపారు. అనంతరం రెండవ తేదీ ఉదయం చిన్నూరు రోడ్డు వంకదగ్గర గంగపూజ అత్యంత వైభవంగా నిర్వహించామని తెలిపారు. వందలాదిమంది భక్తాదులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. తదుపరి సాయంత్రం గ్రామోత్సవ కార్యక్రమాన్ని పట్టణ పురవీధులలో ఊరేగించడం జరిగిందని తెలిపారు. తొలి కార్తీక మాసం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పాల్గొని గంగపూజలు నిర్వహించారు అని తెలిపారు. అనంతరం చిన్నూరు రోడ్డు వంక దగ్గర అచ్చు ఎత్తుట, గుండు ఎత్తుట అనే కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు. తదుపరి మధ్యాహ్నం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగిందని తెలిపారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా అచ్చు ఎత్తుట లో ప్రతిభ కనబరిచిన మొదటి బహుమతిని 10 వేల రూపాయలు,రెండవ బహుమతి 6000 రూపాయలు, మూడవ బహుమతి 3000 రూపాయలు, అదేవిధంగా గుండు ఎత్తుట లో కూడా ప్రతిభ కనపరిచిన మొదటి బహుమతి 6000,రెండవ బహుమతి 4000 రూపాయలు, మూడవ బహుమతి 2000 రూపాయలను ముఖ్య అతిథుల చేతులమీదుగా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ, ఆలయ పెద్దలు, అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు.(Story:ఘనంగా జరిగిన జల్ది పూజ జాతర కార్యక్రమం)