ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించితే కఠిన చర్యలు తీసుకుంటాం సీఐ శోభన్ బాబు
న్యూస్ తెలుగు/విశాలాంధ్ర వినుకొండ : ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించితే కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణ సీఐ శోభన్ బాబు ప్రజలను హెచ్చరించారు. శనివారం రాత్రి సీఐ శోభన్ బాబు. ఎస్సైలు సత్యనారాయణ. స్వర్ణలత. పోలీస్ సిబ్బంది. స్పెషల్ పార్టీ పోలీసులతో. పహారా నిర్వహించారు. శివయ్య స్తూపం సెంటర్. మోతి మసీద్ సెంటర్. మార్కాపురం రోడ్డు. ఎం ఆర్ టి రోడ్డు. పల్నాడు రోడ్డు. నాలుగు వైపులా ట్రాఫిక్ పై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహరదారులకు ఆటో డ్రైవర్లకు. భారీ వాహనాలకు. అలాగే ఆయా ప్రాంతాలలో ఉండే దుకాణం దారులకు పలు హెచ్చరికలు చేశారు. దుకాణాలకు వచ్చే ద్విచక్ర వాహనదారులు ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా తమ వాహనాలను పక్కన పెట్టుకోవాలని. లేనిచో నిబంధనలకు అనుగుణంగా తగు చర్యలు తీసుకుంటామని సీఐ శోభన్ బాబు హెచ్చరించారు.(Story:ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించితే కఠిన చర్యలు తీసుకుంటాం సీఐ శోభన్ బాబు)