వినుకొండకు 240 కోట్లతో శాశ్వత త్రాగునీటి పథకం
ప్రతి ఇంటికి త్రాగునీరు ఇవ్వటమే లక్ష్యం
2027 నాటికి పట్టణ త్రాగునీటి పథకం పూర్తి
న్యూస్ తెలుగు/వినుకొండ : వినుకొండ పట్టణానికి 240 కోట్లతో శాశ్వతంగా త్రాగునీటి సమస్యను పరిష్కరించనున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలిపారు. 30 కోట్ల రూపాయలతో అమృత్ స్కీం ద్వారా జరగనున్న పనులను పబ్లిక్ హెల్త్, మునిసిపల్, రెవిన్యూ వివిధ శాఖల అధికారులతో బుధవారం చీఫ్ విప్ జీవి పరిశీలించారు. వాటర్ ట్యాంకులకు నీటి సరఫరా లో భాగంగా వెల్లటూరు వద్ద ఎన్ఎస్పి డీప్ కట్, దొండపాడు చెరువు, పట్టణానికి త్రాగునీరు సరఫరా చేసే సింగర చెరువులను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ అమృత్ స్కీం ద్వారా 30 కోట్లతో వినుకొండ పట్టణానికి 6 వాటర్ ట్యాంకులు, పైప్ లైన్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. అలాగే యుఐడిఎఫ్ పథకం ద్వారా వినకొండ పట్ట శాశ్వత త్రాగునీటి పరిష్కారానికి 210 కోట్లు నిధులు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా వినుకొండ పట్టణంలో 20 వేల ఇళ్లకు పైగా కుళాయి కనెక్షన్లు ఇచ్చి ప్రతిరోజు రెండో పూటలా స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించడం జరుగుతుందని వివరించారు. స్వచ్ఛమైన త్రాగునీరు, ప్రజా ఆరోగ్య రక్షణ లక్ష్యంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నేత్రత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 24 వేల కోట్లకు పైగా నిధులతో త్రాగునీటి పథకం పూర్తి చేసి ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చేందుకు పనిచేస్తుందన్నారు. యుఐడిఎఫ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో 11020 కోట్లతో, జల జీవన్ పథకం ద్వారా 13 వేల కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి కుళాయి కనెక్షన్ ఇచ్చి స్వచ్ఛమైన త్రాగునీటిని ప్రభుత్వం సరఫరా చేయనుందన్నారు. గత వైసిపి ప్రభుత్వంలో త్రాగునీటి పథకాలను నిర్లక్ష్యం చేసి ప్రజలతో చెరగాటమాడారన్నారు. నిధులు ఉన్నప్పటికీ త్రాగునీటి పథకాలు పూర్తి చేయలేని అసమర్ధులు నాటి వైసిపి పాలకులని ఎద్దేవా చేశారు. తాగునీటి పథకాలను నిర్వీర్యం చేసి జె బ్రాండ్లతో లక్షల కోట్లు అక్రమార్చన పొంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని విమర్శించారు. వినుకొండ పట్టణంలో చేపట్టాల్సిన వాటర్ ట్యాంకులు, పైప్ లైన్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చీఫ్ విప్ జీవి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య శాఖ, మునిసిపల్, రెవిన్యూ, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.(Story : వినుకొండకు 240 కోట్లతో శాశ్వత త్రాగునీటి పథకం )
