దాతల సహాయం కోసం ఎదురుచూపు
పాప ఆరోగ్యానికి సహాయం చేయాలని కోరుచున్నా.. తల్లిదండ్రులు
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని రాంనగర్ కు చెందిన రెడ్డమ్మ బేల్దారి వెంకటేష్ దంపతుల కూతురు మధు ఒకటవ తరగతి చదువుతున్న 6 సంవత్సరాలు ఈ పాపకి డెంగ్యూ జ్వరం వచ్చి తలలో నీరు దిగిందని డాక్టర్లు తెలియజేశారు.
ఐతే ఇప్పుడు అనంతపురం స్టార్ కిడ్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్ లో ఆదివారం నుంచి చికిత్స పొందుతున్నది. దాదాపు ఇప్పటికే 90 వేల దాకా ఖర్చయింది అని,ఇంకా రెండు లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు అని తల్లిదండ్రులు తెలిపారు.బేల్దారి కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్న వెంకటేష్ కుటుంబం ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు దయచేసి దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని పాప ఆరోగ్యానికి సహాయం చేయాలని కోరుచున్నారు. సెల్:9346783706 , పాపమేన మామ ఫోన్ పే :9949677023 అందరూ స్పందించి సహాయం చేస్తారని ఆశిస్తున్నారు.(Story : దాతల సహాయం కోసం ఎదురుచూపు)