విద్యుత్ టోల్ ఫ్రీ సేవలు
– సర్కిల్ సూపెరింటెండెంట్ ఇంజనీర్ వి.వాసుదేవ్
న్యూస్ తెలుగు/కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : విద్యుత్ వినియోగదారులకు టోల్ ఫ్రీ సేవలు మరింత విస్తృతం చేయడం జరుగుతుందని కుమ్రంభీం ఆసిఫాబాద్ సర్కిల్ సూపెరింటెండెంట్ ఇంజనీర్ వి.వాసుదేవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు టోల్ ఫ్రీ నంబర్ 1912 ను అందుబాటులో ఉంచి నిరంతర సేవలు అందించడంతో పాటు సాంకేతికతను జోడించి సత్వర ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ల ఫేయిల్యూర్లు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తినా, బిల్లులో ఏమైనా హెచ్చుతగ్గులు ఉన్నా, ఫ్యూజ్ ఆఫ్ కాల్స్, విద్యుత్ మీటర్ల మార్పు, అన్ని రకాల కొత్త సర్వీసుల మంజూరుకు సంబంధించిన పేరు మార్పు, క్యాటగిరి మార్పు, లోడ్ మార్పు తదితర సమస్యల కొరకు టోల్ ఫ్రీ నంబర్ సంప్రదించి సేవలు పొందవచ్చని తెలిపారు. ఇందులో భాగంగా విద్యుత్ వినియోగదారుడు ముందుగా 1912కు ఫోన్ చేయగానే అట్టి ఫిర్యాదును స్వీకరించి, వివరాలు నమోదు చేసి, సమాచారాన్ని సంబంధిత అధికారికి అందించడంతో పాటు ఫిర్యాదుదారునికి మెసేజ్ రూపంలో అందుతుందని తెలిపారు. ఫిర్యాదులను ఉన్నత స్థాయి అధికారులు సమీక్షించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. (Story ; విద్యుత్ టోల్ ఫ్రీ సేవలు)