Home వార్తలు తెలంగాణ జి.ఎన్ సాయిబాబా సంస్మరణ సభను జయప్రదం చేయండి

జి.ఎన్ సాయిబాబా సంస్మరణ సభను జయప్రదం చేయండి

0

జి.ఎన్ సాయిబాబా సంస్మరణ సభను జయప్రదం చేయండి

సంస్మరణసభ కరపత్రాలను ఆవిష్కరణ

న్యూస్‌తెలుగు/వనపర్తి : ఢిల్లీ యూనివర్సిటీ ఇంగ్లీష్ ప్రొఫెసర్ మేధావి జి,ఎన్ సాయిబాబా సంస్మరణ సభ కరపత్రాలను వనపర్తి సిపిఐ జిల్లా కార్యాలయంలో బుధవారం విడుదల చేయడం జరిగింది. అట్టడుగు వర్గాల ప్రజల హక్కులు, రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల అమలు, సామాజిక న్యాయం, ఆదివాసుల హక్కుల కోసం ఆయన గళం ఎత్తారు. కక్షగట్టిన బిజెపి ప్రభుత్వంఆయనపై అక్రమ కేసులు బనాయించి పదేళ్లు అండా జైల్లో పెట్టింది. మార్చి 2024 లో ఆయన నిర్దోషి అని తేలడంతో జైలు నుంచి విడుదలయ్యారు. జైల్లో ఆయన ఆరోగ్యం క్షీణించి అనేక జబ్బులకు గురయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన ఏడు నెలల్లోనే అనారోగ్య కారణం వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపద్యంలో వనపర్తి పట్టణం బండారు నగర్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవన్లో నవంబర్ 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు సాయిబాబ సంస్మరణ సభ జరుగుతుంది. అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞాప్తి చేస్తున్నాము. కార్యక్రమంలో ప్రముఖ ప్రజాకవి జనజ్వాల, టి పి టి ఎఫ్ నాయకులు కొంకల వెంకట్ నారాయణ, తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షులు జక్కుల వెంకటయ్య, ఎస్సీ, ఎస్టీ సెల్ సభ్యులు గంధం నాగరాజు, పిడిఎస్యు నాయకులు గణేష్, ఏఐటీయూసీ నాయకులు గోపాలకృష్ణ, సిపిఐ పట్టణ కమిటీ కార్యదర్శి రమేష్, బహుజన మహాసభ నాయకులు సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు. (Story : జి.ఎన్ సాయిబాబా సంస్మరణ సభను జయప్రదం చేయండి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version