భారీ వర్షాలకు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
న్యూస్ తెలుగు /సాలూరు : భారీ వర్షాలకు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. గురువారం ఆంధ్రప్రదేశ్ సచివాలయం నుండి చరవాణిలో పత్రికా ప్రకటన విడుదల చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వలన 24 గంటల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని దీనివలన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యంతో పాటు, నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని అన్నారు రాగల. 24 గంటల్లో తేలిక నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించిందని అన్నారు.మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల సూచన మేరకే ప్రధాన ఓడ రేవుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక ఉంటుందని అన్నారు.
రైతులకు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించానని తెలిపారు..
రైతులుకోసిన పంటలకు సరైన వసతులు కల్పించాలని అధికారులకు ఆదేశించారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించి జాగ్రత్తలు తీసుకోవాలి.. అవసరమైన చోట టార్పాలిన్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.. టార్పాలిన్లు వ్యవసాయ అధికారుల వద్ద అందుబాటులో ఉన్నాయని అవి తీసుకెళ్లి వరికుప్పల మీద కప్పి మీ పంట లను జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు.అకాలవర్షానికి ముందు జాగ్రత్తగా, సకాలంలో పంటను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులకు సూచనలు ఇచ్చారు. కలెక్టర్లు మరియు సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆమె అన్నారు.(Story : భారీ వర్షాలకు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి)