మనదేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి
100 వ సంవత్సరం
పీడిత ప్రజలకు రెక్కాడితే గానీ డొక్కాడని రైతు కూలీలకు కార్మికులకు అండగా నిలిచింది కమ్యూనిస్టు పార్టీ యే : మారుతి వరప్రసాద్ సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి
న్యూస్ తెలుగు /వినుకొండ : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని శివయ్య స్తూపం సెంటర్లో గొప్ప బహిరంగ సభ నిర్వహించారు. సభకు ముందుగా శివయ్య స్తూపం వద్ద అరుణ పతాకాన్ని సీనియర్ న్యాయవాది పిజె లూకా ఆవిష్కరించారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా, జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ. సిపిఐ ఆవిర్భవించి డిసెంబర్ 26వ తేదీ గురువారంనాడు 100 వ సంవత్సరంలోకి అడుగుపెడుతుందని, భారత దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో సిపిఐ కీలక పాత్ర నిర్వహించిందని, కులాల మధ్య అంతరాలు అంటరానితనం ఆర్థిక దోపిడీ లేని సమ సమాజ నిర్మాణమే లక్ష్యంగా దున్నేవాడికి భూమి ప్రజల కష్టంతో సృష్టించిన సంపద అన్ని వర్గాల ప్రజలకు సమానంగా పంచాలని, నిరంతరం పోరాడి ఎన్నో సమరశీల పోరాటాలను నడిపిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ దన్నారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నూరు వసంతాలను ఈ సంవత్సరములో వాడ వాడల నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సభలు, సమావేశాలు, పతాక ఆవిష్కరణలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. స్వాతంత్ర్యం అనంతరం సమసమాజ నిర్మాణమే ధ్యేయంగా పోరాడుతూ దేశంలోని ప్రైవేట్ బ్యాంకులు జాతీయకరణ, జమీందారీలు జాగీర్ దారీలు రాజభరణాల రద్దు భూసంస్కరణలు దున్నవానికి భూమి పంచుట తెలంగాణ సాయుధ పోరాటం, భారతదేశంలో లౌకిక వ్యవస్థను పటిష్టవంతం చేయడానికి, దేశంలో రాజ్యాంగం ప్రజాస్వామ్య పరి రక్షణ కోసం నిరంతరం పోరాడి ఎన్నో విజయాలు సాధించిందన్నారు. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో విరోచితమైన ఉద్యమ పాత్ర పోషించిందని, వీరోచిత ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీది అన్నారు. నరేంద్ర మోడీ కుట్ర పూరితంగా ఒకే దేశం, ఒకే పార్టీ, ఒకే ఎన్నిక, ఒకే పాలన ఉండాలని, అధ్యక్ష తరహా ఎన్నికలు జరగాలని, జమిలి ఎన్నికలు తెరపైకి తీసుకురావడం విడ్డురంగా ఉందన్నారు. ఈ జమిలి ఎన్నికలు చంద్రబాబుకు, జగన్మోహన్ రెడ్డికి నష్టం కానీ వీళ్ళిద్దరూ కేసులకు భయపడి బిజెపికి మద్దతు పలికారు. జమిలి ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధంఅన్నారు. ప్రజలందరూ కూడా జమిలి ఎన్నికలను ఖండించాలని అన్నారు. సీనియర్ న్యాయవాది సిపిఐ నాయకులు పి.జే లూకా మాట్లాడుతూ. సిపిఐ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా స్వాతంత్ర్యం అనంతరం పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సిపిఐ కార్యకర్తలు నాయకులు ఎనలేని త్యాగాలు చేశారని భూమికోసం భుక్తి కోసం బడుగు జీవుల విముక్తి కోసం పోరాటాలు చేసి లక్షలాది ఎకరాలు భూములు పేద రైతాంగానికి పంపిణీ చేశారని కార్మిక కర్షక హక్కుల కోసం అనేక చట్టాలు చేశారని అన్నారు. నూరు సంవత్సరాల చరిత్రలో కమ్యూనిస్టు పార్టీ చేసిన పోరాటాలు పేదల సమస్యలపై పార్టీ చేస్తున్న కృషి చూసి వైసిపి పార్టీ నుండి 25 కుటుంబాల వారు సభలో వేదికపై ఎర్ర కండువాళ్ళ కప్పుకొని సిపిఐ లో చేరారు. ఈ సభలో ఇంకా మాజీ వైస్ చైర్మన్ సండ్రపాటి సైదా పట్టణ కార్యదర్శి రైతు నాయకులు ఉలవలపూడి రాము, ఉపాధ్యాయ సంఘ నాయకులు చంద్రజిత్ యాదవ్, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జిల్లా నాయకులు శ్రీనివాస్, సిపిఐ మాజీ పట్టణ కార్యదర్శి పటాన్ లాల్ ఖాన్, సిపిఐ మండల కార్యదర్శులు పిన్నబోయిన వెంకటేశ్వర్లు, రాయబారం వందనం, ఎ. పవన్ కుమార్, షేక్ కిషోర్, కె. మల్లికార్జునరావు, కొండ్రముట్ల చిన్న సుభాని, షేక్ మస్తాన్, సాంబయ్య మహిళలు లక్ష్మి, రమణ, కాశమ్మ, ప్రజానాట్యమండలి గాయకులు జార్జి. పి ప్రసాద్, మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. (Story :మనదేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 వ సంవత్సరం)