Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పుష్ కార్ట్స్ పున ప్రారంభం

పుష్ కార్ట్స్ పున ప్రారంభం

0

పుష్ కార్ట్స్ పున ప్రారంభం

న్యూస్‌తెలుగు/ వినుకొండ‌ : పట్టణంలో పాడైపోయిన పుష్ కార్ట్స్ వల్ల పారిశుధ్య కార్మికులు పడుతున్న అవస్థల్ని తొలిగించడానికి ఎమ్మెల్యే జి వి ఆంజనేయులు పిలుపు మేరకు మునిసిపల్ చైర్మన్ దస్తగిరి, మునిసిపల్ కమీషనర్ సుభాష్ చంద్రబోస్ ఇరువురు చొరవ తీసుకొని అధ్వానంగా పాడైన పుష్ కార్ట్స్ ని త్వరిత గతిన తయారు చేయించి పునరుద్ధరించబడిన పుష్ కార్ట్స్ ని పారిశుధ్య కార్మికులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమన్ని పురస్కరించుకొని కమీషనర్ మాట్లాడుతూ. పట్టణ ప్రజలు మరియు వ్యాపారస్తులు భారతీయ నిబంధనలు ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ నియమాలు 2016 ప్రకారం
వ్యర్థాలను బయోడిగ్రేడబుల్, నాన్-బయోడిగ్రేడబుల్ మరియు ప్రమాదకరంగా మూడు వర్గాలుగా విభజించి తమ ఇంటినుండి వ్యాపార సముదాయాల నుండి వచ్చు చెత్తను విధిగా తడిచెత్తగా, పొడిచెత్తగా, ప్రమాదకర చెత్తగా మూడు విభాజితాలుగా వేరుచేయ్యాలని, ఇందువలన తడిచెత్తను వర్మికంపోస్ట్ తయారుచేయడానికి మరియు ఐ.ఎస్.డబ్ల్యు.ఎం. నందు విండ్రోజ్ పద్ధతి ద్వారా ఎరువు తయారు చెయ్యడానికి వినియోగిస్తామని తెలిపారు. పొడిచెత్తను వేరు చేసి ఇవ్వడం వల్ల పునర్వినియోగపరచదగిన వస్తువులను వేరుచేసి వాటి అమ్మకం వల్ల మునిసిపల్ కార్యాలయంకు ఆర్థిక స్వావలంబన కలుగుతుందని తెలిపారు. ప్రమాదకర చెత్తను వేరుచేసి ఇవ్వడంవల్ల ఆ చెత్తను గుంటూరు వద్దనున్న జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నకు పంపించడం ద్వారా పట్టణం చెత్త రహితంగా పరిపూర్ణంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కమీషనర్ సుభాష్ చంద్రబోస్ ప్రజలను కోరారు. (Story : పుష్ కార్ట్స్ పున ప్రారంభం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version