టపాసు విక్రయ కేంద్రాల స్థలమును పరిశీలించిన ఆర్డిఓ మహేష్
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ఈనెల 29, 30వ తేదీ దీపావళి పండుగను పురస్కరించుకొని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ బాలుర క్రీడా మైదానంలో ఏర్పాటు చేసే టపాసుల విక్రయ దుకాణ స్థలమును వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలో లైసెన్స్ కలిగిన ఏడు మందికి మాత్రమే టపాసుల విక్రయ అనుమతి ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే సమావేశంలో విద్యుత్తు, మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ, ఫైర్ విభాగాలతో తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని, విద్యుత్ సర్క్యూట్ కాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని అక్కడి వారికి తెలియజేశారు. ప్రతిదుగ దుకాణానికి మూడు అడుగుల దూరం తప్పనిసరిగా ఉండాలని సూచించారు. చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాన్ని కొనిస్తుందని తెలిపారు. అదేవిధంగా టపాసుల స్టాకును పట్టణానికి దూరంగా ఒకచోట ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. అవసరమున్నప్పుడే స్టాకులు తెప్పించాలని తెలిపారు. ఎక్కడా ఎటువంటి సంఘటనలు జరగకుండా అన్ని ప్రభుత్వ అధికారులు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. కేవలం ఇనుప రేకుతో కూడినటువంటి గదులను నిర్మించాలని తెలిపారు. ప్రతి దుకాణం దగ్గర నీరు ఇసుక తప్పనిసరిగా ఉండాలన్నారు. తదుపరి పాటించాల్సిన పలు సూచనలను జాగ్రత్తగా వివరించడం జరిగిందని తెలిపారు. వీరి వెంట ఎమ్మార్వో నటరాజ్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్, ఫైర్ ఆఫీసర్ రాజు, సిఐలు నాగేంద్రప్రసాద్, రెడ్డప్ప, శ్యామ్ రావు తదితరులు పాల్గొన్నారు. (Story : టపాసు విక్రయ కేంద్రాల స్థలమును పరిశీలించిన ఆర్డిఓ మహేష్)