420హామీలు,ఆరు గ్యారంటీలు అటకేకించిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి
మాజీ తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
న్యూస్ తెలుగు/వనపర్తి : 420హామీలు,ఆరు గ్యారంటీలు అటకేకించిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మాజీ తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతాంగ ప్రజా నిరసన సదస్సు సన్నాహక సమావేశం ఆదివారం పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామములో మండల పార్టీ అధ్యక్షులు వేణు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ ఇచ్చిన సంక్షేమ పథకాలను మించి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అన్నివర్గాల ప్రజలను నట్టేటముంచిందని అన్నారు. వంద రోజులలో ఆరు గ్యారంటీలు డిసెంబర్ 9 నాటికి పూర్తి స్థాయిలో రుణ మాఫీ అని రైతు బంధు ఇప్పుడు తీసుకుంటే 5వేలు,ఎన్నికల తర్వాత తీసుకుంటే 7500అని చెప్పి రైతు భరోసా ఇవ్వలేమని సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించడం పట్ల తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. రైతులకే రైతు భరోసా దిక్కులేదంటే రైతుకూలిలకు,కౌలు రైతులకు ఇస్తామని రైతుల ఓట్లు దండుకుని రైతులను నట్టేటముంచి వారిని హరిగోస పెడుతుందని దుయ్యబట్టారు. అంతేకాకుండా కుటుంబములో ఉన్న ప్రతి మహిళకు 2500ఇస్తామని,వృద్దులకు 4000ఫించన్ ఇస్తామని,కళ్యాణ లక్ష్మితో పాటు తొలమ్ బంగారం ఇస్తామని,నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని, దివ్యాంగులకు,బీడి కార్మికులకు, ఒంటరి మహిళలకు ఫించన్లు ఇస్తామని ఒకటి కాదు రెండు కాదు అలవికాని హామీలు ఇచ్చి మోసం చేసిందని దుయ్యబట్టారు. రైతు బంధు కోసం కె.సి.ఆర్ 7500కోట్లు కేటాయిస్తే ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి ఆపిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అంటే ఈ రాష్ట్ర బడ్జెట్ మూడింతలు కావాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతాంగ ప్రజా నిరసన సదస్సు ఏర్పాటు చేశామని ముఖ్య అతిథిగా మాజీ మంత్రి టి.హరీష్ రావు పాల్గొంటున్నారని రైతు కార్మిక కర్షక విద్యార్థి మహిళా లోకం యువత అధికసంఖ్యలో పాల్గొని సదస్సు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రఘుపతి రెడ్డి,మన్నేపు రెడ్డి, అమ్మపల్లి.శ్రీనివాస్ రెడ్డి,నాగేంద్ర యాదవ్,శేఖర్ గౌడ్,మాజీ ఎం.పి.టి.సి.లు,మాజీ సర్పంచులు,గ్రామ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.(Story:420హామీలు,ఆరు గ్యారంటీలు అటకేకించిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి)