దీపావళి పండుగకు పాత్రికేయులకు నిత్యావసర సరుకులు పంపిణీ
ఎన్డీఏ కార్యాలయ ఇంచార్జ్ హరీష్ బాబు
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : దీపావళి పండుగను పురస్కరించుకొని పట్టణములోని పాత్రికేయులకు నిత్యావసర సరుకుల పంపిణీని ఎన్డీఏ కార్యాలయ ఇన్చార్జ్ హరీష్ బాబు చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిదిగా ఉంటూ సమస్యలను పరిష్కరించే దిశగా పాత్రికేయులు కీలక పాత్ర వహించడం నిజంగా గర్వించదగ్గ విషయం అని తెలిపారు. ప్రభుత్వాలు మారిన ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాత్రికేయులు తమ కలముతో సమాజాన్ని అభివృద్ధి బాటలో నడుపుతున్నారని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించుటలో పాత్రికేయుల పాత్ర అమోఘమని తెలిపారు. అవినీతి అక్రమాలను కథాంశాల రూపంలో తెలుపుతూ అధికారుల ద్వారా న్యాయం చేసేటట్లు తన వృత్తిని కొనసాగించడం సంతోషించ తగ్గ విషయమని తెలిపారు. పాత్రికేయులు ప్రజల సమస్యలను పరిష్కరించుటలోనే ప్రజల వద్ద మంచి గుర్తింపు లభిస్తుందని తెలిపారు. న్యాయపోరాటంలో పాత్రికేయుల వృత్తి నాలుగవ పిల్లర్గా నిలుస్తోందని తెలిపారు. నిష్పక్షపాతంగా రాగద్వేషాలకు అతీతంగా తమ విధులను నిర్వర్తించడం ద్వారా ప్రజల అభివృద్ధిలో వాత్రికేయులు కీలక పాత్ర పోషించడం ఖాయమని వారు స్పష్టం చేశారు. అన్యాయాలను ఖండిస్తూ న్యాయం వైపు అత్యంత ప్రాధాన్యమైన వృత్తిని నడపడమే జర్నలిజం అని తెలిపారు. అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మోహన్ ఎన్డీఏ కార్యాలయ ఇన్చార్జ్ హరీష్ బాబుకు పాత్రికేయుల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి కార్యాలయ ఇన్చార్జ్ హరీష్ బాబు, బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు సాకే ఓబులేసు, బిజెపి నాయకులు డోలా రాజారెడ్డి,జింకా రామాంజనేయులు, శ్యామరావు, అప్రా చెరువు వీర నారప్ప, గొట్లూరు రామకృష్ణ, సునీల్ కుమార్, బాలాజీ, ఊట్ల నరేంద్ర, ధర్మవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జానపాటి మోహన్, ప్రధాన కార్యదర్శి మురళి గౌడ్, కోశాధికారి నాగభూషణ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు పాల్గొన్నారు.(Story : దీపావళి పండుగకు పాత్రికేయులకు నిత్యావసర సరుకులు పంపిణీ)