‘శ్రేయ’ ఆధ్వర్యంలో భక్తి గీతాలు విడుదల
– ఆరోగ్య బీమా పథకం కూడా..
న్యూస్‌తెలుగు/ హైదరాబాద్ : నవరాత్రిని పురస్కరించుకొని శ్రేయ మ్యూజిక్, ఎంటర్‌టైన్‌మెంట్ ఆధ్వర్యంలో రెండు భక్తి గీతాలను విడుదల చేశారు. అవి.. ‘మైయా కా గుంగాన్ కరో’, ‘తేరే దార్ కా పూజారి జగదాంబే’. ఈ గీతాలతో పాటు ఉద్యోగులు, వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య బీమా పథకాన్ని కూడా ప్రారంభించారు. ‘మైయా కా గుం గణ్ కరో’ గోలూ డీ ఆలపించారు. ముకేష్ రాజ్ లిరిక్స్ రాశారు. హిమాంశు కుమార్ దీపక్ సంగీతం అందించారు. పంచీ జలోన్‌వి దర్శకత్వం వహించారు. ‘తేరే దర్ కా పూజారి జగదంబే’ సుర్భీ సింగ్ ఆలపించారు. హిమాంశు కుమార్ దీపక్ లిరిక్స్, సంగీతం అందించారు. పంచీ జలోన్‌వి దర్శకత్వం వహించారు. సంగీత రాయ్ నిర్మాతగా, శ్రేయ రాయ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా డీ తాత్యా, పీ మహేశ్వర్ ఉన్నారు. ఈ సందర్భంగా శ్రేయ మ్యూజిక్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ క్రియేటివ్ హెడ్ హేమంత్ కుమార్ రాయ్ మాట్లాడుతూ ఈ భక్తి గీతాల లక్ష్యం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించడమేనన్నారు.
ఈ భక్తి గీతాలతో పాటు ఉద్యోగులు, వినియోగదారుల కోసం ‘శ్రేయ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్’ పేరుతో ప్రత్యేక ఆరోగ్య బీమా కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టామని తెలిపారు. ఈ పథకం కింద శ్రేయ గ్రూప్ ఉద్యోగులు రూ. మూడు లక్షల వరకు ఆరోగ్య కవరేజీని అందుకుంటారన్నారు. ఈ సంస్థలోని లీడర్స్ రూ. రెండు నుంచి పది లక్షల వరకు కవరేజీకి అర్హులన్నారు. శ్రేయ గ్రూప్ వినియోగదారులు రూ.రెండు నుంచి మూడు లక్షల మధ్య ఆరోగ్య బీమా కవరేజీ ప్రయోజనం పొందుతారన్నారు. దేశవ్యాప్తంగా ఇరవై వేలకు పైగా ఆసుపత్రులలో చికిత్సను అందించే భాగస్వామ్య బీమా కంపెనీ ద్వారా ఈ బీమా కవర్ చేయబడుతుందని తెలిపారు.
శ్రేయ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లక్నోలోని టెలిబాగ్‌లో కొత్త కార్యాలయానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఇది సామాజిక, వ్యాపార ప్రయత్నాలలో పెరుగుతున్న నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందని తెలిపారు. ఈ రెండు కార్య క్రమాలు సమాజానికి సేవ చేయడంలో ఉన్న అంకితభావానికి నిదర్శనం అన్నారు. (Story : ‘శ్రేయ’ ఆధ్వర్యంలో భక్తి గీతాలు విడుదల)