UA-35385725-1 UA-35385725-1

పిల్లల వైద్య నిమిత్తం ఎన్.ఆర్.సి.లో నిర్దిష్టమైన ప్రామాణిక ఆపరేటింగ్ విధానం అమలు చేయాలి

పిల్లల వైద్య నిమిత్తం ఎన్.ఆర్.సి.లో నిర్దిష్టమైన ప్రామాణిక ఆపరేటింగ్ విధానం అమలు చేయాలి

న్యూస్‌తెలుగు/ వనపర్తి : వయస్సుకు తగ్గ ఎత్తు, బరువు లేని పిల్లల వైద్య నిమిత్తం ఏర్పాటు చేసిన ఎన్.ఆర్.సి. లో నిర్దిష్టమైన ప్రామాణిక ఆపరేటింగ్ విధానం అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం ఉదయం వనపర్తి మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని అదనపు కలక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలోని స్యామ్ మ్యామ్ పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి వయస్సు కు తగ్గ ఎత్తు, బరువు లేకుండా ఉండటానికి గల కారణాలు తెలుసుకొని చికిత్సతో పాటు అక్కడే పౌష్టికాహారం అందించి ఆరోగ్యం చేకూర్చేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన ఎన్ ఆర్ సి. కేంద్రంలో పూర్తిస్థాయి ఫలితాలు సాధించాలని వైద్యులను ఆదేశించారు. జిల్లాలో దాదాపు 200 వరకు స్యామ్, మ్యామ్ పిల్లలు ఉన్నట్లు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా గుర్తించడం జరిగిందని వారిని ఎన్.ఆర్.సి. కేంద్రానికి రప్పించి వయస్సుకు తగ్గ ఎత్తు బరువు లేకుండా ఉండటానికి గల కారణాలను అవసరమైన రక్త పరీక్షల ద్వారా తెలుసుకొని సరైన వైద్యం తో పాటు అక్కడే పౌష్టికాహారం అందించాలని సూచించారు. ఇక్కడ ఉన్న వైద్య సిబ్బందితో పాటు ఒక అంగన్వాడీ కార్యకర్త, హెల్పర్, ఆశా వర్కర్ ను అందుబాటులో ఉంచే విధంగా చూడాలని సూచించారు. ఇప్పటి వరకు ఎంతమంది పిల్లలను తీసుకువచ్చారు, వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది బరువు పెరిగారా అని ఆరా తీశారు. రిజిస్టరు పరిశీలించారు. ఎన్.ఆర్.సి అనేది ఒక అడ్వాన్సు వైద్య కేంద్రమని, ఇక్కడ పిల్లలను ఆరోగ్యవంతులను చేసేందుకు ఒక నిరీధమైన ప్రామాణిక ఆపరేటింగ్ విధానం అమలు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా నిబంధనల మేరకు పిల్లల వెంట వచ్చే తల్లికి రోజుకు కొంత డబ్బును చెల్లించాలని సూచించారు. పిల్లల ఆరోగ్య సంరక్షణ పై తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాలని సూచించారు.
అనంతరం పక్కనే కొత్తగా నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ యూనిట్ భవనాన్ని పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఆధునిక వైద్య విధానంలో ప్రాణాలు కాపాడేందుకు ఉద్దేశించిన క్రిటికల్ కేర్ యూనిట్ భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టరు, వైద్య ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. లేబర్ శాతం పెంచాలని డిసెంబర్ చివరి నాటికి నిర్మాణం పూర్తి చేసి అప్పగించాలని ఆదేశించారు.
మాతా శిశు కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న సి.టి స్కాన్ యూనిట్ ను వెంటనే ప్రభుత్వ విద్య శాఖకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. సి.టి స్కాన్ అవసరం ఉన్న వారు బయట డబ్బులు వెచ్చించి చేయించుకోవాల్సి వస్తుందని, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఉపయోగంలోకి తీసుకురావాలని సూచించారు.
అనంతరం కలక్టర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. వార్డులు అన్ని తిరుగుతూ రోగులతో మాట్లాడారు. వైద్యం అందుతున్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కంటి శస్త్ర చికిత్స నిమిత్తం ఏర్పాటు చేస్తున్న ఆపరేషన్ ధియేటర్ గది మరమ్మతు పనులను పరిశీలించారు. మరమ్మతు పనులు పూర్తి అయ్యేలోపు కంటి శస్త్ర చికిత్సకు అవసరమైన యంత్ర సామాగ్రిని తెప్పించాలని, నవంబర్ 4వ తేది వరకు ఆపరేషన్ ధియేటర్ పూర్తి కావాలని ఆదేశించారు.
ఆసుపత్రిలో డయాలసిస్ వైద్య కేంద్రం పై అంతస్తులో ఉన్నందున రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అందువల్ల రోగులను తరలించడానికి అవసరమైన లిఫ్ట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇవ్వాలని ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం, సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. జయచంద్ర మోహన్, ప్రోగ్రాం ఆఫీసర్లు డా. సాయినాథ్ రెడ్డి, డా. పరిమళ, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రంగారావు, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మమ్మ, టి.ఎస్.యం. ఐ.డి.సి. కార్యనిర్వహక ఇంజనీరు జైపాల్ రెడ్డి, డి. ఈ, ఏ ఈ లు తదితరులు పాల్గొన్నారు. (Story ; పిల్లల వైద్య నిమిత్తం ఎన్.ఆర్.సి.లో నిర్దిష్టమైన ప్రామాణిక ఆపరేటింగ్ విధానం అమలు చేయాలి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1