ప్రణాళికాబద్ధంగా వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : ప్రణాళికాబద్ధంగా వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వానాకాలం వరి కొనుగోలు పై సమీక్ష సమావేశం నిర్వహించారు. సన్న రకం, దొడ్డు రకం ధాన్యం కొనుగోలు కేంద్రాలు వేరు వేరుగా పెట్టాలని ఎట్టి పరిస్థితుల్లో ఒకే కొనుగోలు కేంద్రంలో సన్న రకం, దొడ్డు రకం సేకరించడానికి వీలు లేదని ఆదేశించారు. ఆయా గ్రామ పరిధిలో ధాన్యం ఉత్పత్తిని బట్టి గ్రామంలో ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి, సన్న రకం ఎన్ని పెట్టాలి, దొడ్డు రకం ఎన్ని పెట్టాలి అనేది పకడ్బందీగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. పౌర సరఫరాల శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో ప్రణాళిక సిద్ధం చేయాలని రైతులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు. ఏ రైతు తన ధాన్యాన్ని ఎక్కడ ఏ కోనుగోలు కేంద్రానికి తీసుకువెళ్ళాలి అనేది వ్యవసాయ విస్తీర్ణాధికారి ద్వారా రైతుకు సమాచారం వెళ్ళాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని, గన్ని బ్యాగులు, టార్పాలిన్ ల కొరత లేకుండా చూసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ యం నగేష్, వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ నాయక్, పి.డి డి ఆర్డీఏ ఉమా దేవి, పౌర సరఫరాల శాఖ అధికారి కాశీ విశ్వనాథ్, డి.యం. సివిల్ సప్లై ఇర్ఫాన్ , డి.పి.యం అరుణ తదితరులు పాల్గొన్నారు. (Story : ప్రణాళికాబద్ధంగా వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి)