ఎమ్మెల్యే జీవి కి ఆరోగ్య మిత్ర వినతిపత్రం
న్యూస్‌తెలుగు/వినుకొండ: రాష్ట్ర ఆరోగ్య మిత్రుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మాచర్ల బుజ్జి, కాకాని అప్పారావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జీవి కి వినతి పత్రం అందచేశారు. రాష్ట్రంలోని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో పనిచేస్తున్న వైద్యమిత్రాలు ఈనెల 29వ తేదీ నుండి నిరవధిక సమస్య చేయాలని రాష్ట్ర యూనియన్ నిర్ణయించారు. దాన్లో భాగంగా శుక్రవారం వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పార్టీ కార్యాలయంలో డిమాండ్లతో కూడిన వినతి పత్రం వినుకొండలోని అన్ని ప్రైవేటు గవర్నమెంట్ హాస్పటల్ మిత్రాలు కలిసి ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే జీవి స్పందిస్తూ మీ డిమాండ్లు హెల్త్ మినిస్టర్ కి పంపిస్తున్నాను నాకు సాధ్యమైనంతవరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీకు న్యాయం జరిగే విధంగా నా వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మా డిమాండ్లు సమాన పనికి సమాన వేతనం కేడర్ ఉద్యోగ భద్రత మరియు ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టే ఆరోగ్య బీమా పాలసీలు వైద్యమిత్రాలకు ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శి మాచర్ల బుజ్జి, కాకాని అప్పారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి సింగంశెట్టి వెంకటేశ్వర్లు, నాగలక్ష్మి, మహేశ్వరి, హనుమంతరావు, హరిబాబు, నాయక్, తదితరులు పాల్గొన్నారు. (Story : ఎమ్మెల్యే జీవి కి ఆరోగ్య మిత్ర వినతిపత్రం)