Home వార్తలు ‘మట్కా’  నుంచి ‘తస్సాదియ్యా’ సాంగ్ రిలీజ్

‘మట్కా’  నుంచి ‘తస్సాదియ్యా’ సాంగ్ రిలీజ్

0

‘మట్కా’  నుంచి ‘తస్సాదియ్యా’ సాంగ్ రిలీజ్

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘మట్కా’ నవంబర్ 14 న థియేటర్లలోకి రానుంది. కరుణ కుమార్ దర్శకత్వంలో వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మించిన ఈ మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్‌ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి.

జివి ప్రకాష్ కుమార్ అందిస్తున్న మ్యూజిక్ మట్కాకి వన్ అఫ్ ది మేజర్ హైలెట్. తాజాగా విడుదల చేసిన సెకండ్ సింగిల్- తస్సాదియ్యా దీనికి నిదర్శనం. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. రెట్రో బీట్స్, పవర్ ఫుల్ కంపోజిషన్ తో వచ్చిన సెకండ్ సింగిల్ తస్సాదియ్యా ఇన్స్టంట్ హిట్ అలరించింది.

భాస్కరభట్ల రాసిన లిరిక్స్ వింటేజ్ టైమ్స్ లో లైఫ్ ఎసెన్స్ ని ప్రజెంట్ చేస్తోంది. మనో లైవ్లీ వోకల్స్ పదాలకు జీవం పోశాయి, రో విన్సెంట్ EL Fé కోయిర్‌ మరింత ఇంపాక్ట్ ని పెంచింది.

వరుణ్ తేజ్ ఈ పాటలో ఎనర్జిటిక్ గా కనిపించారు, స్పాట్-ఆన్ స్టైలింగ్ తో అదరగొట్టారు. వరుణ్ తేజ్ డ్యాన్స్ మూమెంట్స్ కన్నులవిందుగా ఉన్నాయు. నోస్టాల్జియా అండ్ రిఫ్రెష్ వైబ్‌ తో పాట అదిరిపోయింది.

ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎ కిషోర్ కుమార్ డీవోపీగా పని చేస్తున్నారు.

తారాగణం: వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులు

సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కరుణ కుమార్
నిర్మాతలు: డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి
బ్యానర్లు: వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: ఎ కిషోర్ కుమార్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
సీఈఓ: ఈవీవీ సతీష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్కే జానా, ప్రశాంత్ మండవ, సాగర్
కాస్ట్యూమ్స్: కిలారి లక్ష్మి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా (Story : ‘మట్కా’  నుంచి ‘తస్సాదియ్యా’ సాంగ్ రిలీజ్)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version