మున్సిపల్ ఉద్యోగులు బాధ్యతతో సేవలు నిర్వర్తించాలి
మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : మున్సిపల్ ఉద్యోగులు బాధ్యతతో సేవలను నిర్వర్తించాలని, అప్పుడే పురపాలక సంఘ కార్యాలయమునకు మంచి గుర్తింపు లభిస్తుందని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు.ఈ సందర్భంగా మునిసిపల్ కార్యాలయం నందు మున్సిపల్ కమిషనర్ అమినిటి సెక్రెటరీస్, మున్సిపల్ ఇంజనీర్, హౌసింగ్ ఇంజనీర్స్‌తో సమావేశాన్ని నిర్వహించి, కొనసాగుతున్న ప్రస్తుత పనులు మరియు సేవల ప్రావరణాన్ని వారు సమీక్షించారు. సమావేశంలో ముఖ్యాంశాలు లో వారు మాట్లాడుతూ సమస్యల ట్రాకింగ్: కార్యదర్శులకు విద్యుత్ (స్ట్రీట్ లైట్) నీటి సరఫరా సమస్యల కోసం ఒక రిజిస్టర్ నిర్వహించాలని, పరిష్కరించని సమస్యలను సంబంధిత ఇంజనీర్స్‌కి అందించాలనీ వారు ఆదేశించారు. హౌసింగ్ వర్క్స్ లక్ష్యాలు: హౌసింగ్ డిపార్ట్మెంట్ చే నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి ప్రస్తుత హౌసింగ్ వర్క్స్ స్థితిని సమీక్షించ డం జరిగిందన్నారు.
పనితీరు సమీక్ష: తక్కువ పనితీరు చూపిస్తున్న కార్యదర్శుల గురించి ప్రత్యేక సమీక్షలు నిర్వహించబడ్డాయని, మెరుగుదలకు కఠినమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది అన్నారు. నీటి నాణ్యత పరిశీలన: వినియోగదారుల ఫీడ్‌బ్యాక్‌తో పాటు నీటి నాణ్యత పరీక్ష ఫలితాలను నమోదు చేయడానికి ఒక రిజిస్టర్ నిర్వహించాలని ఆదేశించడం జరిగిందన్నారు..ఇంటర్నెట్ కనెక్షన్లు: వార్డ్ సచివలయాలలోని ఉన్నటువంటి ఇంటర్నెట్ సమస్యలను పరిష్కరించడానికి ఇంజనీర్స్‌కు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. పట్టణంలోని ఏ వార్డు సమస్యలు కూడా రాకుండా తగిన జాగ్రత్తలను తీసుకుంటూ విధులు నిర్వర్తించాలని తెలిపారు.(Story :మున్సిపల్ ఉద్యోగులు బాధ్యతతో సేవలు నిర్వర్తించాలి)