Home వార్తలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో...

ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి.

0

ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి

చిన్న జిల్లా చింతలేని

జిల్లాగా ఏర్పాటు చేసుకోవాలి.

అన్ని శాఖల ఉద్యోగులు ఒక కుటుంబ సభ్యుల పని చేయాలి.

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి పనులను గుర్తించాలి.

గ్రామాలలో చేపట్టే పనులపై ప్రజల అభిప్రాయ సేకరణ చేయాలి.

జాప్యానికి తావులేకుండా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ మంజూరీలు.

చెక్కుల పంపిణీ చేసిన మంత్రి.రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క.

న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) : జిల్లాలో పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులు ఒక కుటుంబ సభ్యులుగా పనిచేస్తూ ములుగుచిన్న జిల్లాను చింత లేని జిల్లాగా తీర్చిదిద్దాలని, వివిధ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో గ్రామాలలో పర్యటించి చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గుర్తించాలని, జాప్యానికి తావులేకుండా అర్హులైన లబ్దిదారులకు సకాలంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు మంజూరు చేయాలని,రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులకు సూచించారు.మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా, డీఎఫ్ఓ రాహూల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్లు మహేందర్ జి, సంపత్ రావు లతో కలసి మంత్రి ములుగు జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ శాఖల అధికారులు చేపట్టిన అభివృద్ధి పనులపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రతి గ్రామంలో చేపట్టనున్న అభివృద్ధి పనులపై ఆయా గ్రామాల ప్రజలతో చర్చించిన అనంతరం అంచనాలను తయారుచేసి నివేదికలు సమర్పించాలని అన్నారు.అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు వారి పనితనాన్ని మెరుగుపరుచుకోవాలని, ప్రజలకు ఉపయోగపడే పనులను చెయ్యాలని సూచించారు. ప్రభుత్వం నుండి విడుదలవుతున్న నిధులను ప్రజలకు ఉపయోగపడే పనులను చేస్తూ, సద్వినియోగం చేసుకోవాలని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడే, ప్రజల సమస్యలు తెలుసుకుంటారని అన్నారు. ఎన్.ఆర్.జి.ఎస్ పథకం కింద పంట పొలాలకు వెళ్లే దారిలో రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేసుకోవడంతో పాటు,చెక్ డాముల నిర్మాణం, అంగన్వాడి కేంద్రాల ఏర్పాటు వాటికి ఉపయోగించుకోవాలని, గ్రామాలలో ఈ పథకం కింద కూలీలకు పనులు కల్పించాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు చేపట్టవలసిన పనులపై ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని అన్నారు.రానున్న మినీ మేడారం జాతరకు మేడారం గ్రామంలో భక్తులకు ఉపయోగపడేలా శాశ్వత పనులు చేపట్టాలని అన్నారు. ప్రతి శాఖ అధికారి తన క్రింది స్థాయి సిబ్బందితో నిత్యం సమావేశాలు నిర్వహిస్తూ అభివృద్ధి పనులపై  దృష్టి సారించాలని ఆదేశించారు.ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని, అవసరమైతే ఇతర శాఖల సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం విద్య, వైద్యం, సంక్షేమాభివృద్ధి రంగాలకు పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తోందని వెల్లడించారు. నిరుపేద కుటుంబాలకు బాసటగా నిలవాలనే సంకల్పంతో, రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద ఆడబిడ్డల పెళ్ళికి ఆర్ధిక సహాయం అందిస్తోందన్నారు. ఎలాంటి కాలయాపన జరగకుండా లబ్దిదారులు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకున్న నెల రోజుల, వ్యవధిలోనే అర్హులైన వారికి షాదిముబారక్, కల్యాణలక్ష్మి పథకం కింద చెక్కులు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఒకవేళ దరఖాస్తులు తిరస్కరిస్తే, అందుకు గల కారణాలను దరఖాస్తుదారుడికి తెలియజేయాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా, వారికి సకాలంలో చెక్కులు మంజూరయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని మంత్రి స్పష్టం చేశారు. దళారుల ప్రమేయం లేకుండా, పూర్తి పారదర్శకంగా శీఘ్రగతిన మంజూరీ ప్రక్రియ జరగాలని అన్నారు.జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో పయనింపజేసేందుకు పార్టీలకు అతీతంగా పని చేద్దామని పిలుపునిచ్చారు.అనంతరం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఐటిడిఏ పి. ఓ. చిత్రమిశ్రా లతో కలసి కల్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకం కింద52మంది లబ్దిదారులకు ఒక్కొక్కరికి రూ. లక్షా 116 చొప్పున మొత్తం రూ.52 లక్షల పైచిలుకు విలువ కలిగిన చెక్కులను మంత్రి దనసరి అనసూయ సీతక్క అందజేశశారు.ఈ సమావేశం లో ఆర్డీఓ కే సత్య పాల్ రెడ్డి, ఇరిగేషన్ ఎస్ ఈ విజయ భాస్కర్, నేషనల్ హై వే, పంచాయితి రాజ్, ఆర్ అండ్ బి, ట్రైబల్ వెల్ఫేర్, ఇరిగేషన్, ఆర్ డబ్లుఎస్, ఎలక్ట్రిసిటీ ఇంజనీరింగ్ అధికారులు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీ డి ఓ లు, ఇతర అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.(Story:ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి.)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version