కనగానపల్లి లో అత్యధికంగా వర్షపాతం నమోదు
ఆర్డిఓ మహేష్
న్యూ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈనెల 21వ తేదీ ఉదయం 8 గంటల నుండి 22వ తేదీ ఉదయం 8:30 గంటల వరకు కురిసిన వర్షపాతం వివరాలను ఆర్డిఓ మహేష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ పరిధిలో కనగానపల్లి మండలం లో 198.2 మిల్లీమీటర్లు అధిక వర్షపాతం నమోదయిందని, అదేవిధంగా ధర్మవరంలో 78.6 మిల్లీమీటర్లు, బత్తలపల్లి లో 60.4, తాడిమర్రి లో 56.4, ముదిగుబ్బలో 72.4, చెన్నై కొత్తపల్లి లో 95.4, రామగిరిలో 98.4 మొత్తం 659.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ గోపాల్ పాల్గొన్నారు.(Story:కనగానపల్లి లో అత్యధికంగా వర్షపాతం నమోదు)