పిల్లల యొక్క అభిరుచులు తెలుసుకొని వారి పట్ల తల్లిదండ్రులు జాగ్రత వహించాలి
పాఠశాల నుండి పరిపోయిన బాలుడిని బందువులకు అప్పగింత
ఏటూరు నాగారం ఎస్సై తాజుద్దీన్
న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) : పిల్లల యొక్క అభిరుచులు తెలుసుకొని వారి పట్ల తల్లిదండ్రులు జాగ్రత వహించాలని,ఏటూరు నాగారం ఎస్సై తాజుద్దీన్ అన్నారు.మండల కేంద్రంలో మంగళ వారంస్పోర్ట్స్ పాఠశాల ఏటూరు నాగారం నుండి ములుగు జిల్లా వెంకటాపురం మండలం బర్ల గూడెం గ్రామానికి చెందిన జజ్జరి సుమలత,ఆనంద్ ల కంటే కుమారుడు ముకేష్ 11 సం రాలు,పాఠశాల నుండి పరిపోయిన బాలుడిని బందువులకు పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరిగిందన్నారు.ఎస్ ఐవివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. తేది 21న బాలుడు తల్లి , పిల్లాడిని పాఠశాలకు తీసుకొని వచ్చి, పాఠశాలలో అడ్మిషన్ చేయిoచి, తిరిగి ఇంటి కి వెళ్లడం జరిగిందని, పిల్లవాడు చదువు కోవడం ఇష్టం లేక పాఠశాలలో ఉదయం పూట, అల్పాహారం తీసుకోని ఎవరికీ తెలియకుండా పాఠశాల నుండి బయటకి వచ్చి, జాతీయ రహదారిపై పరిపోతుండగా, అటూగా కానిస్టేబుల్ అజయ్ కి కనిపించడంతొ, పోలీసు స్టేషన్ తీసుకొని వచ్చి, బాలుడి యొక్క సమాచారం తల్లి తండ్రుల కు పాఠశాల వారికి, తెలిపి వారి బందువు చింత హరికృష్ణ కి అప్పగించడం జరిగిందన్నారు.పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత వహించాలి.ఎస్. ఐ. తాజ్ద్దీన్.పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత వహించాలిని ఏటూరు నాగారం ఎస్సై తాజుద్దీన్ అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లల యొక్క అభిరుచులు తెలుసుకొని, వారికి ఇష్టం ఐతేనే, దూర ప్రాంతాలలో పాఠశాలకు పంపించాలన్నారు. పిల్లల ఇష్టాలను గౌరవించి, బంగారు భవిష్యత్తుకు, బాటలు వెయ్యాలని అన్నారు. దూర ప్రాంతాల్లో చదవడం మీ యొక్క పిల్లలకు ఇష్టం లేకపోతే, బలవంతంగా పిల్లలను పాఠశాలలకు పంపిస్తే, ఈ విధంగా పాఠశాల నుండి బయటకి వచ్చి పారిపోవడం జరుగుతుందన్నారు.పిల్లల యొక్క ఇష్ట ఇష్టాలు తెలుసుకొని గౌరవించి వారికి,నచ్చజెప్పి మంచి మార్గంలో ప్రయాణించే విధంగా వారికి తెలపాలన్నారు. పాఠశాల నుండి పారిపోతున్న విద్యార్థిని గుర్తించి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన కానిస్టేబుల్ అజయ్ ని ఎస్సై ఈ సందర్భంగా అభినందించారు.(Story:పిల్లల యొక్క అభిరుచులు తెలుసుకొని వారి పట్ల తల్లిదండ్రులు జాగ్రత వహించాలి.)