శ్రావణిని సన్మానించిన ఎమ్మెల్యే
న్యూస్‌తెలుగు/వనపర్తి : పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామానికి చెందిన కీర్తిశేషులు ముకుంద రెడ్డి అరుణ దంపతుల కుమార్తె శ్రావణి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పబ్లిక్ హెల్త్ సెక్టార్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించుకుంది. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదివారం వనపర్తి లోని నంది హిల్స్ లో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం శ్రావణిని అభినందిస్తూ శాలువాలతో సన్మానించారు కుటుంబ పరిస్థితులను సమన్వయం చేసుకుంటూనే ఓపెన్ క్యాటగిరిలో ప్రభుత్వ ఉద్యోగం ను సాధించడం అభినందించదగ్గ విషయమని ఎమ్మెల్యే శ్రావణిని ప్రశంసించారు. కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుప్పిరెడ్డి అశోక్ రెడ్డి, కుటుంబ సభ్యులు కరుణాకర్ రెడ్డి ఆనందలక్ష్మి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు (Story : శ్రావణిని సన్మానించిన ఎమ్మెల్యే)