ఉచిత ఇసుక పాలసీపై మంత్రి సంధ్యారాణి కి ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు
న్యూస్ తెలుగు/ సాలూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను జీవితాంతం గుండెల్లో పెట్టుకొని పూజించుకుంటామని. నాటు బళ్ళు మరియు ట్రాక్టర్ల యజమానులు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాటుబళ్ళు తో ట్రాక్టర్ల తో ఇసుక తీసుకోవడానికి నూతన ఇసుక విధానాన్ని అనుమతి ఇచ్చిన సందర్భంగా ఆదివారం సాలూరు పట్టణంలో గల మంత్రి క్యాంప్ ఆఫీస్ లో నాటు బండ్లు ఇసుక యజమానులు ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మంత్రి శ్రీ గుమ్మడి సంధ్యారాణి ని కలిసి ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఉచిత ఇసుక పాలసీపై మంత్రి సంధ్యారాణి ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు కృతజ్ఞతలు తెలపాలని ఆమెకు ట్రాక్టర్ యజమానులు. తెలియజేశారు.
ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ఉచిత ఇసుక విధానంలో ట్రాక్టర్, యడ్లబల్లలో నదులు, వాగులు, నుంచి ఎంత ఇసుక కావాలంటే అంత ఇసుక తీసుకొని వెళ్లవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారని అన్నారు..గత వైసిపి పాలనలో ఇసుక అధికరేట్లతో వుండడం వలన నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతినిందని అన్నారు దీనివలన అసంఘటిత రంగ కార్మికులు ట్రాక్టర్ యజమానులు కార్మికులు డ్రైవర్లు కుటుంబాలు రోడ్డున పడ్డాయని, అన్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన 125 రోజులలో ఉచిత ఇసుక విధానం తీసుకురావటం వలన కొత్త ఆశలు చిగురించాయని, చంద్రబాబు నాయుడు గారిని జీవితాంతం మా గుండెల్లో పెట్టుకొని పూజించుకుంటామని ఇసుక యజమానులు తెలిపారు మంత్రి సంధ్యారాణి కి పుష్పగుచ్చం అందించి ట్రాక్టర్ యజమానులు వారి ఆనందాన్ని మంత్రి తో పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో ట్రాక్టర్ యజమానులు గులిపిల్లి నారాయణరావు, నల్లి సత్యనారాయణ, కొర్రాయి శ్రీను, పప్పల రామకృష్ణ చలుమూరి సంతోష్, శ్రీను, సురేష్ తదితరులు పాల్గొన్నారు. (Story : ఉచిత ఇసుక పాలసీపై మంత్రి సంధ్యారాణి కి ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు)