నీట్ లో మెడిసన్ సీటు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం
న్యూస్‌తెలుగు/వనపర్తి : 2024 నీట్ లో మెడిసిన్ సీటు సాధించిన విద్యార్థులకు టీఎస్ యుటిఎఫ్ వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. టీఎన్జీవో భవనం జరిగిన ఆత్మీయ అభినందన సన్మాన సభలో పలువురు ఉపాధ్యాయ పిల్లలకు, ఆటోకార్మీకుని కూతురు ను ఈ సందర్భంగా ఘన సన్మానం చేయడం జరిగింది. కార్యక్రమంను ఉద్ధేశించి టిఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శ ఎస్.రవి ప్రసాద్ గౌడ్, డి కృష్ణయ్య, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్,ఎంఈవోలు శ్రీనివాస్ గౌడ్, మద్దిలేటి, బి. శ్రీనివాసులు,మాట్లాడుతూ ఉపాధ్యాయులు కష్టపడి తమ పిల్లలను చదివించి వైద్య రంగానికి అందించడం గర్వంగా ఉంది అన్నారు. విద్యార్థులు అత్యంత ప్రతిభాను కనబరిచి ఆణిముత్యాలుగా వెలగొందాలని వారిని అభినందించారు.మెడిసిన్ పూర్తి చేసి అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం, దేశానికి తమ సేవలు అందించాలని కోరారు. అనుకున్న లక్ష్యం వైపు పయనించాలని పిలుపు నిచ్చారు. కాగా మెడిసిన్ సీటు సాధించిన విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ పలువురిని ఆశ్చర్యపరిచారు. కార్యక్రమంలో జిహెచ్ఎంలు గణేష్,శంకర్ గౌడ్ ,సెక్టోరియల్ అధికారి కే. శేఖర్,ఉద్యోగ ఫెన్సెన్ దారులు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామన్ గౌడ్,ప్రజావాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్,తో పాటు టీఎస్ యుటిఎఫ్ జిల్లా నాయకులు హామీద్, బి వెంకటేష్, శ్రీనివాస్ గౌడ్ ,తిమ్మప్ప,డి.రాధకృష్ణ,గంగన్న,అయ్యోధ్య రాములు, శ్రీరాం,సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెడిసిన్ సాధించిన జే.అఖిల్,యం. కృతిక, డి.వికాస్, జి. శశికిరణ్,జె. వర్షిత ,సోమ కృషి వర్షిని శ్రీ అక్షయ, తరుణ్ కుమార్,శ్రీవాస్తవలను శాలువా బొకేలతో ఘనంగా సన్మానం చేశారు. (Story : నీట్ లో మెడిసన్ సీటు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం)