ఇంటర్నేషనల్ హాఫ్ మారధాన్ పోటీలలో వినుకొండ వాసి అబ్దుల్లా ప్రతిభ
న్యూస్‌తెలుగు/వినుకొండ:– శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఇంటర్నేషనల్ హాఫ్ మార్ధాన్ 20 24 లో వినుకొండ కు చెందిన యువ క్రీడాకారుడు షేక్ అబ్దుల్లా పాల్గొని తన కిరీటంలో మరో కలికితు రాయిని పదిల పరుచుకున్నాడు. ఈ పరుగుల పోటీలో తన స్థానాన్ని పదిలపరుచుకున్నాడు. ఈ పోటీలో కెన్యా, చైనా,నేపాల్, స్వీడన్ మరియు యూఏఈ దేశాల పోటీదారులు పాల్గొన్నారు. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రారంభమైన పోటీలలో ఒకటి, రెండు మూడు స్థానాలు కెన్యా దేశ క్రీడాకారులు సాధించుకోగా, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది స్థానాలు వివిధ దేశాల వారు సాధించు కున్నారు. మన భారతదేశం నుండి పాల్గొన్న మొత్తం క్రీడాకారులలో పల్నాడు జిల్లా వినుకొండ వాసి అయినా షేక్ అబ్దుల్లా 10 వ స్థానం సాధించి వినుకొండకు, మన రాష్ట్రానికి ఆ పోటీలలో పేరు ప్రఖ్యాతులు సాధించుకొని వస్తున్నాడు.
ఈ సందర్భంగా అబ్దుల్లా మాట్లాడుతూ ఇటీవల తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన పట్ల చూపిన శ్రద్ధ మరింత స్ఫూర్తిని ఇచ్చిందని ఇదే స్ఫూర్తితో మున్ముందు రాబోయే ఒలంపిక్స్ లో పాల్గొని దేశానికి మరిన్ని పథకాలు సాధించి తీసుకొస్తానని అన్నారు. అదేవిధంగా నన్ను ప్రతిరోజు పర్యవేక్షిస్తూ, సంప్రదింపులు చేస్తున్న మా అన్నయ్య లాంటి ఎండి కరీముల్లా మరియు నాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్న ఎమ్మెల్యే జీవి. ఆంజనేయులు కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. (Story : ఇంటర్నేషనల్ హాఫ్ మారధాన్ పోటీలలో వినుకొండ వాసి అబ్దుల్లా ప్రతిభ)