UA-35385725-1 UA-35385725-1

సమాజ విలువలు, సంస్కృతి, ధైర్యాన్ని ఇచ్చేందుకు

సమాజ విలువలు, సంస్కృతి, ధైర్యాన్ని ఇచ్చేందుకు

న్యూస్ తెలుగు/వనపర్తి : సమాజంలో నైతిక విలువలు, సంస్కృతి తో పాటు ధైర్య సాహసాలకు గ్రంధాలయాలు ఎంతో తోడ్పడతాయని రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కృష్ణారావు అన్నారు .గురువారం వనపర్తి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా నియమితులైన లంకల గోవర్ధన్ సాగర్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఫంక్షన్ హాల్లో నిర్వహించగా మంత్రి జూపల్లి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాను గ్రాడ్యూట్ పూర్తి చేయడానికి హైదరాబాద్ అఫ్జల్ గంజ్ లోని స్టేట్ లైబ్రరీ ప్రధాన కారణమని, తాను అందులో చదువుకొని డిగ్రీ పాస్ అయినట్లు జ్ఞాపకం చేసుకున్నారు. విద్యార్థులకు నాణ్యత, విలువలతో కూడిన విద్యాభ్యాసం లేనందున విద్యార్థులు చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడని, విద్యార్థులు పెడదారి పట్టకుండా నాణ్యమైన విద్యతో పాటు క్రీడలు బాగా ఆడాలని సూచించారు. విద్యతో పాటు ఆటలు ఆడటం వల్ల నైపుణ్యం, ధైర్య సాహసాలు వస్తాయని తెలియజేశారు.వనపర్తి జిల్లాలో ప్రతి మండలంలో గ్రంథాలయాలను పండగ వాతావరణంలో ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని అందుకు అవసరమైన నిధులు తాను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి గ్రంథాలయంలో తెలుగు, ఆంగ్ల పత్రికలు ఉండాలని వాటితో పాటు ఉద్యోగ పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను గ్రంథాలయాల్లో ఉంచాలని సూచించారు.గత ప్రభుత్వం దాదాపు 8 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్లిందని వాటికి ప్రతి నెల వడ్డీ చెల్లించేందుకు రూ. 5 వేల కోట్లు అవసరం అవుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగులేనప్పటికిని ఇచ్చిన హామీలను నెరవర్చుకుంటూ వెళుతున్నామని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి మాట్లాడుతూ చదువుల పర్తి గా పేరుగాంచిన వనపర్తి జిల్లాలో విద్యార్థులను ఉద్యోగ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి గ్రంథాలయాలను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. ఒక కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, గ్రంథాలయంలో అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గంధాలయాన్ని బాగా అభివృద్ధి చేసి విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచాల్సిన బాధ్యత కొత్తగా ఎంపికైన గ్రంధాలయ చైర్మన్ పై ఉందని తెలిపారు. గ్రంధాలయంతో పాటు వనపర్తి జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయించాల్సిందిగా మంత్రిని కోరారు. జిల్లాకు ట్యాంక్ బండ్ గా ఉన్న నల్ల చెరువును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పరచేందుకు సహకరించాలని జిల్లా ప్రజలు సాయంత్రం పూట ఆహ్లాదం కొరకు ఒక బొట్ మంజూరు చేయమని మంత్రిని కోరగా వెంటనే మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. నూతనంగా గ్రంధాలయ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన లంకల గోవర్ధన్ సాగర్ మాట్లాడుతూ మనిషి మనో విజ్ఞానానికి గ్రంథాలయం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ ప్రాంతంలో గ్రంథాలయాల అభివృద్ధికి సురవరం ప్రతాపరెడ్డి కృషి చేశారని కొనియాడారు. విద్యార్థులు పోటీ పరీక్షల సన్నద్ధతకు అవసరమైన పుస్తకాలు గ్రంథాలయంలో అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు రాష్ట్ర గ్రంధాలయ అధ్యక్షుడు రియాజ్ లంకల గోవర్ధన్ సాగర్ చేత వనపర్తి జిల్లా గ్రంథాలయాల చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయించారు. జిల్లా మత్స్య శాఖ ద్వారా నల్ల చెరువులో చేప పిల్లల విడుదల గురువారం జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో స్థానిక నల్ల చెరువులో రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జుపల్లి కృష్ణారావు, స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి తో కలిసి 70 వేల చేప పిల్లలను వదిలారు. జిల్లాలో చెరువులు, రిజర్వాయర్లు బాగా ఉన్నాయని, వర్షాలు బాగా కురువడంతో నీటి లభ్యత సైతం పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం ద్వారా చేపల పెంపకం పెంచి ఉపాధి కల్పనకు కృషి చేస్తుందని తెలిపారు. డి.సి.సి.బి చైర్మన్ విష్ణు వర్ధన్ రెడ్డి, రాష్ట్ర గ్రంధాలయాల అధ్యక్షుడు రియాజ్, మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ కృష్ణ, జిల్లా మత్స్య శాఖ అధికారి లక్ష్మప్ప, గ్రంధాలయ కార్యదర్శి మనోజ్, సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.(Story:సమాజ విలువలు, సంస్కృతి, ధైర్యాన్ని ఇచ్చేందుకు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1