Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ జగన్ ద్రోహానికి యువత బదులు చెప్పే సమయం వచ్చింది

జగన్ ద్రోహానికి యువత బదులు చెప్పే సమయం వచ్చింది

0

జగన్ ద్రోహానికి యువత బదులు చెప్పే సమయం వచ్చింది

తెదేపా విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జీవీ, ఆలపాటి, మక్కెన, ఏఎస్ రామకృష్ణ

న్యూస్‌తెలుగు/వినుకొండ : దోపిడీ తప్ప ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, వారి ఆకాంక్షలేమాత్రం పట్టకుండా జగన్ చేసిన ద్రోహానికి యువత బదులు తీర్చుకునే సమయం వచ్చిందని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. అన్నారు. తెలుగుదేశం సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, మక్కెన మల్లికార్జునరావు, ఏఎస్ రామకృష్ణ. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలోవచ్చిన అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుని మళ్లీ వైకాపాను లేవకుండా చేయాలన వారంతా పిలుపునిచ్చారు. వినుకొండలోని తిమ్మాయపాలెం రోడ్డులో ఉన్న వై కన్వెన్షన్ హాల్‌లో బుధవారం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం, ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మొదట మాట్లాడిన ఎమ్మెల్యే జీవీ ఆనాడు జగన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే నియంత, అవినీతి పాలన మాకు వద్దని యువత ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఎన్నికలు జరిగిన 3 ఎమ్మెల్సీ స్థానాల్లో తెదేపా అభ్యర్థులను గెలిపించారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ఆనాడే పునాది పడిందన్నారు. సాధారణ ఎన్నికల్లో 93% ఎమ్మెల్యేలను గెలిపించి పట్టం కట్టారన్నారు. వారంత కూటమిపై ఉంచిన నమ్మకం నిలబెట్టుకుంటున్నామని, 120 రోజుల్లోనే యువత కోసం డీఎస్సీ, ఉద్యోగ నోటిఫికేషన్ల కసరత్తు సహా అనేకకార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇప్పుడు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ పోటీ చేస్తున్నారని, భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తొలి ప్రాధాన్యతగా పట్టభద్రుల ఓట్లను చేర్పించడమేనని, తర్వాత పార్టీ సభ్యత్వాలు చేయిద్దామని అన్నారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్సీ అభ్యర్థి, మాజీమం త్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ యువత ఐదేళ్ల వైసీపీ పాలన గుర్తుతెచ్చుకోవాలని కోరారు. యువతను నిర్వీర్యం చేసి, గంజాయి రాష్ట్రంగా, మహిళలపై అత్యాచారాలు, ప్రతిపక్ష నేతను గొంతునొక్కే కార్యక్రమం, ఆఖరికి అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించే పాలన ఇచ్చారన్నారు. ఈ రాష్ట్రంలో మళ్లా గత పాలన వాసన గానీ గాలి గానీ తగలకుండా మనల్ని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజల భుజస్కందాలపైనే ఉందన్నారు. నైపుణ్యాభివృద్ధి కేసులో ఎవరో ఆస్తులు అటాచ్ చేస్తే సీఎం చంద్రబాబుకు ఏం సంబంధమని, మళ్లీ జైలుకు వెళ్తారంటూ మసిపూసి మారేడుకాయలా మొసలికన్నీళ్లు కార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జన రావు 4 నెలల కూటమి పాలనలో ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారని, వారితోపాటు ఉద్యోగులు కూడా ఒకటో తేదీనే జీతాలు తీసుకుంటూ సంతోషంగా ఉన్నారన్నారు. ముఖ్యంగా పట్టభద్రులకు సంబంధించి మెగా డీఎస్సీ ప్రకటించారని, మంత్రి లోకేష్ విదేశాల్లో పర్యటనలు చేస్తూ రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు. విద్యావంతుడు, పాలనలో మంచి అనుభవం ఉన్న ఆలపాటి రాజాను గెలిపించుకుంటే వినుకొండ నియోజకవర్గంలో అభివృద్ధితో పాటు సమస్య వచ్చినప్పుడు ఎమ్మెల్యే జీవీతో పాటు మంచి అనుభవం ఉన్న నాయకుడిని గెలిపించుకుంటే తోడ్పాటుగా ఉేంటుందన్నారు. ఇక్కడ 10 వేల పట్టభద్రుల ఓట్లు ఉంటాయని, ప్రతి ఇంట్లో ఒక పట్టభద్రుడు ఉన్నారని, వారందరిని ఓటర్లుగా చేర్చి ఓటు వేయించే బాధ్యత కూటమి శ్రేణులదే అని చెప్పారు. 90 శాతం ఓట్లు ఆలపాటి రాజాకే పడతాయన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ మాట్లాడుతూ వైకాపా పాలనలో రాష్ట్రానికి అణుబాంబు వేసినంత నష్టం జరిగిందన్నారు. మనమంతా ఒకప్పుడు సంబరపడ్డామని, 2014-19 మధ్య సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు నా పొలం ధర రూ.36 లక్షలు, రూ.40 లక్షలని చెప్పుకుని అమ్ముకోలేదని, చంద్రబాబు మళ్లీ వస్తే రూ.కోటి అవుతాయని భావించారని, జగన్ ఆ కలలన్నీ నాశనం చేశాడని గుర్తు చేశారు. ఇప్పుడు జగన్ 4 రోజులకొకసారి తాడేపల్లి-బెంగళూరు తిరుగుతున్నాడని, ఎందుకు వెళ్తున్నాడో ఎందుకు వస్తున్నాడో, ఏం చేస్తున్నారో తెలియడం లేదన్నారు. అధికారం లేకపోతే బతకలేను అన్నట్లుగా జగన్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా కూటమి గెలిచి తీరాలన్నారు. తద్వారా 2029లో మళ్లీ కూటమే వస్తుందనే నమ్మకం కలుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వానికి ఒక కానుకగా ఆలపాటి రాజాకు అద్భుతమైన విజయాన్ని మనం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. (Story : జగన్ ద్రోహానికి యువత బదులు చెప్పే సమయం వచ్చింది)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version