మద్యం షాపుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి
పది లక్షల వరకు నష్టపోయానని బాధితుడి ఆవేదన
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : పట్టణంలోని ఎర్రగుంటలో నూతన మద్యం షాపును ప్రారంభించిన కొన్ని గంటల్లోనే గుర్తుతెలియని వ్యక్తులు మద్యం షాపుపై దాడి చేసి, పది లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు బాల్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులు షాపులోని తాళాలను బద్దలు కొట్టి సెక్యూరిటీని బెదిరించి బ్రాందీ బీరు బాటిల్లను పూర్తిగా ధ్వంసం చేయడం జరిగిందని, అదేవిధంగా కంప్యూటర్ ఇతర పరికరాలను కూడా ధ్వంసం చేసి సీసీ కెమెరాలు సైతం పగలగొట్టడం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం సిండికేట్ లో చేరని వైన్ షాపులపై దౌర్జన్యం చేయడం జరిగిందని వైయస్సార్సీపీ నాయకుడుగా ఉన్న నా దుకాణం పై దాడి చేయడం ఎంతవరకు సమంజసమని వారు తెలిపారు. చట్టపరంగా తాను మద్యం దుకాణమునకు దరఖాస్తు చేసుకొని, జిల్లా అధికారులు కూడా కేటాయించడం జరిగిందని తెలిపారు. కూటమి పార్టీల మద్యం మాఫియా రెచ్చిపోయిందని తెలిపారు. సిండికేట్ లో చేరని మద్యం దుకాణదారులను బెదిరించడం షాపులను ధ్వంసం చేయడం పరిపాటిగా మారిపోయింది అని తెలిపారు. మద్యం సిండికేట్ లోకి తాను చేరేందుకు నిరాకరించడం వలన మంగళవారం అర్ధరాత్రి సమయంలో వైఎస్సార్సీపీ నాయకుడు బాల్రెడ్డి అను తనపై, దుకాణంపై దాడి చేయడం సరైన పద్ధతి కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో మొత్తం 20 మద్యం దుకాణాలకు ఇటీవల టెండర్లను నిర్వహించి లాటరీలో విజేతల్లో తన పేరు కూడా ఉందని తెలిపారు. వీటిలో 80 శాతానికి పైగా కూటమి పార్టీల వారికే దుకాణాలు ఉన్నాయని, మిగిలిన 20 శాతము దుకాణాలు తతస్తులుగా వైసిపి సానుభూతిపరులుగా దక్కించుకోవడం జరిగిందని తెలిపారు. నన్ను బెదిరించినట్లే నా మద్యం దుకాణం పై దాడి చేయడం జరగడం, నన్ను తీవ్ర మనోవేదనకు గురి చేసిందని తెలిపారు. ఇది ముమ్మాటికీ ఎన్డీఏ కూటమి నాయకుల చెరువుతోనే జరిగిందని వారు తెలిపారు. మద్యం దుకాణంలో ఉన్న పది లక్షల మద్యం స్టాకును ఇనుపరాడులతో దాడి చేసి మద్యం బాటిల్లను పగలగొట్టడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా చేతికి అందినంత మద్యం దుకాణాలను కూడా దోచుకోని పదాలు కావడం జరిగిందన్నారు. స్థానికుల ద్వారా తాను సమాచారాన్ని అందుకొని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. తదుపరి డిఎస్పి శ్రీనివాసులు ఆధ్వర్యంలో సంఘటన స్థలాన్ని సందర్శించి దర్యాప్తుని చేపట్టారు. ఎన్డీఏ కూటమి దౌర్జన్యాలకు తాను భయపడేది లేదని వారు స్పష్టం చేశారు. నియోజకవర్గంలో తనకు ఏడో నెంబర్ మద్యం దుకాణం తన మిత్రుడు కామిరెడ్డిపల్లి రవీందర్ రెడ్డి కి మూడవ నెంబర్ మధ్య దుకాణము వేలంపాటలో దక్కించుకోవడం జరిగిందని తెలిపారు. సిండికేట్ లో చేరాలని నాయకుల తీవ్రమైన ఒత్తిడి తెచ్చిన తాము బెదరలేదని తెలిపారు. ధనార్జన కోసం ప్రజలను పీడించడం కూటమి నాయకులు ఇకనైనా మానుకోవాలని వారు హితవు పలికారు. ఎన్ని ఇబ్బందులు భవిష్యత్తులో ఎదురైనా కూడా మద్యం దుకాణం నడిపి తీరుతామని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం సిండికేట్ దారులపై చర్యలు తీసుకొని మాకు రక్షణ కల్పించాలని తెలిపారు. ఈ దాడికి సంబంధించి పోలీసులు సీరియస్గా తీసుకోగా సిసి ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించడం జరిగిందన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ నియోజకవర్గంలో మద్యం సిండికేటులు, గొడవలు సృష్టించడం, నివారణ చర్యలు చేపట్టకపోవడం సరైన పద్ధతి కాదని, మాకు న్యాయం చేసే విధంగా సంబంధిత అధికారులు ప్రభుత్వము తగిన చర్యలు వెనువెంటనే తీసుకోవాలని వారు తెలిపారు. (Story : మద్యం షాపుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి)