దసరా ఉత్సవాల్లో సత్తా చాటిన ధర్మవరం మానస నృత్య కళాకేంద్రం
న్యూస్‌తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులోని రవీంద్ర భారతి నందు దసరా నవరాత్రి ఉత్సవాలు ఆంగ్రంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంకు చెందిన మానస నృత్య కళా కేంద్రమును వారు ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా బుధవారం నిర్వహించిన ఈ ఉత్సవాల కార్యక్రమాలలో మానస నృత్య కళా కేంద్రం గురువు మానస ఆధ్వర్యంలో అందరిని ఆకట్టుకునే విధంగా నృత్యాలను ప్రదర్శించారు. తదుపరి గురువు మానస కు నంది పురస్కారమును అక్కడి ఎంపీ కృష్ణయ్య చేతులు మీదుగా అందుకున్నారు. అదేవిధంగా పాల్గొనే వారందరికీ కూడా స్వర్ణ నంది అవార్డులను ఇస్తూ అందరినీ ఘనంగా సత్కరించారు. మానస ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రదర్శనలో శిశు బృందం శ్రీ గౌరీ, శాన్వి స్వరూప్, సాహిత్య శేఖర్, రుత్విక పాల్గొన్నారు. (Story :దసరా ఉత్సవాల్లో సత్తా చాటిన ధర్మవరం మానస నృత్య కళాకేంద్రం)