అబ్దుల్ కలాం జీవితం అందరికీ ఆదర్శమవ్వాలి
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : భారత మాజీ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త అందరికీ ఆదర్శప్రాయుడు అబ్దుల్ కలాం గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన అబ్దుల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారతదేశపు మిస్సైల్ మ్యాన్ (missile man) గా పేరుగాంచిన గొప్ప శాస్త్రవేత్త అబ్దుల్ కలాం గారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నిరాడంబరుడు నిగర్వి బాలల మనస్తత్వం కలిగిన భారతీయ శాస్త్రవేత్త ప్రపంచ గుర్తింపు పొందిన గొప్ప నాయకుడు అబ్దుల్ కలాం గారిని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్ మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు. (Story : అబ్దుల్ కలాం జీవితం అందరికీ ఆదర్శమవ్వాలి)