ప్రారంభమైన అజీమ్-ఆల్ సుల్తాన్ 46వ ఉరుసు మహోత్సవ వేడుకలు
అధ్యక్షులు నాసిర్ అహ్మద్
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని కొత్తపేట రైల్వే స్టేషన్ ఎదురుగా గల అజీమ్-అల్ సుల్తాన్ మైనారిటీ చారిటీ ట్రస్ట్ 46వ ఉరుసు మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభించడం జరిగిందని అధ్యక్షులు నాసిర్ అహమ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఉరుసు వేడుకలు ఈనెల 14వ తేదీ నుండి 16వ తేదీ వరకు మూడు రోజులు పాటు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా మొదటి రోజు దర్గాలోని సమాధికి ప్రత్యేక పూజలు జరిగాయని తెలిపారు. తదుపరి గంధముతో ఈ వేడుకలు ప్రారంభించామని తెలిపారు. తెల్లవారుజామున 3 గంటలకు పూల చాందినీ తో పకీరు వాళ్లు యొక్క మేళ తాళాలతో మెరువని చేయడం జరిగిందని, తదుపరి తెల్లవారుజామున 5 గంటలకు ఆస్థానం చేరి నిషా నీపై గంధం ఎక్కించడం జరిగిందని తెలిపారు. ఈ వేడుకలు లేట్ షేక్ అబ్దుల్ నజీమ్ భాష ఆధ్వర్యంలో నిర్వహిస్తూ విరాళాలు ఇచ్చిన దత్త శివ, చాంద్ భాషా, షేక్షావలి సన్స్, చిరాకు ఉద్దీన్, కొండా శ్రీనివాసులు, సయ్యద్ దాదా పీర్, రోషన్, సయ్యద్ మునుమార్ లకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేయడం జరిగిందని తెలిపారు. ఈనెల 15న ఉరుసు, 16న జిహారత్ తో వేడుకలు ముగుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ, మహమ్మదీయ సోదరీ సోదరులందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. (Story : ప్రారంభమైన అజీమ్-ఆల్ సుల్తాన్ 46వ ఉరుసు మహోత్సవ వేడుకలు)