డిగ్రీ ద్వితీయ సెమిస్టర్ ఫలితాలలో శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల విద్యార్థినిలు ప్రతిభ
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ఎస్కే యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ ఫలితాలలో పట్టణంలోని శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల విద్యార్థినీలు విశేష ప్రతిభను ఘనపరచడం తోపాటు పట్టణ ప్రధమ రావడం జరిగిందని ప్రిన్సిపాల్ మల్లికార్జున తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవలం అత్యధిక మార్కులే కాక ఓవరాల్ రిజల్ట్ ను ఏ కోణంలో విశ్లేషించిన మా పద్మావతి డిగ్రీ కళాశాల ప్రతిభ పాటవాలు సాక్షాత్తు రయ్యాయని తెలిపారు.. బీఎస్సీ (హానరస్) ఆర్. వైష్ణవి 95 శాతం, పి .మమతా 92 శాతం, పి.. దరిని 90 శాతం, బీకాం హానర్స్ గ్రూపులో ఎం. జ్యోతి 88శాతం, కే. విజయదుర్గ 87 శాతము, సి. అనూష 86 శాతము, ఎం. మానస 86 శాతము, వై. యుగలక్ష్మి 85 శాతం, బీబీఏ హానర్స్ గ్రూపులో ఎస్.. యాస్మిన్ 83 శాతం, కె. అయిషా బాను 79 శాతము, ఎం. కళ్యాణి 77 శాతము, డి. హిమబిందు 76 శాతము పట్టణ ప్రధమ సాధించడం జరిగిందని తెలిపారు. తదుపరి ప్రతిపకర పరిచిన విద్యార్థినీలకు కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున తో పాటు కరస్పాండెంట్ సాయి, డైరెక్టర్ జగదీష్,, తోటి విద్యార్థినీలు,, అధ్యాపక, బోధ నేతర బృందం అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విజయానికి కృషిచేసిన అధ్యాపక బృందాన్ని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. (Story : డిగ్రీ ద్వితీయ సెమిస్టర్ ఫలితాలలో శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల విద్యార్థినిలు ప్రతిభ)