మానవ సేవను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి
శ్రీ సత్య సాయి సేవ సమితి నిర్వాహకులు
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : మానవ సేవను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని శ్రీ సత్య సాయి సేవ సమితి నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 360 మందికి భోజనపు ప్యాకెట్లను, వాటర్ ప్యాకెట్లను వైద్యులు, సిస్టర్ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్లు కూడా పంపిణీ చేశారు. అనంతరం శ్రీ సత్య సాయి సేవ సమితి నిర్వాహకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం కాకి కృష్ణవేణి, భర్త ఉపేంద్ర నాథ్ వారి దాతల సహాయ సహకారములతో నిర్వహించడం పట్ల వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. పుట్టపర్తి సాయిబాబా ఆశీస్సులతో గత కొన్ని సంవత్సరాలుగా ఇటువంటి సేవా కార్యక్రమాల నిర్వహించడం మాకెంతో సంతోషంగా, తృప్తిగా ఉందని తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలకు ఆసక్తిగా గలవారు సెల్ నెంబర్ 9966047044 గాని 903044065 గాని సంప్రదించవచ్చునని తెలిపారు. తదుపరి ఆసుపత్రి సూపర్డెంట్ మాధవి మాట్లాడుతూ శ్రీ సత్య సాయి సేవ సమితి వారు నిర్వహిస్తున్న ఇటువంటి సేవా కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆసుపత్రికి ఎన్నో గ్రామాల నుండి తరలివస్తారని, అటువంటి వారికి భోజనం పంపిణీ చేయడం నిజంగా వారికి వరం లాగా మారిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో 27 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు. (Story : మానవ సేవను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి)