ఘనంగా జరిగిన వన మహోత్సవ కార్యక్రమం వేడుకలు
ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జూటూరు రమణయ్య
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని కెపిటి వీధిలో గల వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఈనెల మూడవ తేదీ నుండి 15వ తేదీ వరకు దసరా శరన్నవ రాత్రుల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 11వ రోజు ఆర్య వైశ్యులు పట్టణములోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఆర్యవైశ్య సంఘము, ఆలయ కమిటీ, వాసవి మహిళా సంఘం,, ఆర్యవైశ్య యువజన సంఘం తదితర అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేక అలంకరణను అర్చకులు గావించి, ప్రత్యేక పూజలను నిర్వహించారు. తదుపరి వాసవి భజన మండలి వారిచే దేవతల గీతాలాపన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. తదుపరి అనంతపూర్ జిల్లా నార్పల లోని ఆర్యవైశ్య మహాసభ ప్రింట్ మీడియా కమిటీ చైర్మన్ సీనియర్ పత్రిక సంపాదకులు ఇటికాల శివ రామాంజనేయులు ను, ధర్మవరం ఆంధ్రప్రభ విలేకరి గ్రంథే శ్రీనివాసులు ఘనంగా సన్మానించారు. తదుపరి శరన్నవరాత్రుల కార్యక్రమాలలో భూరి విరాళం ఇచ్చిన ఆర్యవైశ్య ప్రముఖులను కూడా ఘనంగా సన్మానించారు. తదుపరి రామాయణం మహాభారతం ఇతిహాసముల నుండి ప్రత్యేక క్విజ్ ప్రోగ్రాం లో గెలుపొందిన వారికి దేవత నాగరాజుచే నగదు బహుమతులు కూడా అందజేశారు. ఈ వేడుకలు ఈనెల 15వ తేదీతో ముగుస్తాయని కమిటీ వారు తెలిపారు. (Story : ఘనంగా జరిగిన వన మహోత్సవ కార్యక్రమం వేడుకలు)