ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించండి
కమిషనర్ ప్రమోద్ కుమార్
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ధర్మవరం పట్టణంలో పూర్తి దశలో ప్లాస్టిక్ నిషేధానికి అధికారులతో పాటు ప్రజలు కూడా సహకరించాలని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా తన చాంబర్లో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, వాడు శానిటేషన్లు, ఎన్విరాన్మెంటల్ కార్యదర్శిలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలో ప్రజలు ఎక్కడబడితే అక్కడ చెత్త వేయరాదని, అలా వేస్తే కఠిన చర్యలు తీసుకోబడును అని తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని 40 వార్డులలో ఎక్కడ కూడా పారిశుద్ధ్య లోపం ఉండరాదని, శానిటరీ ఇన్స్పెక్టర్లు కార్యదర్శులు మేస్త్రీలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేటట్టు చేయాలని తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని చిన్న పెద్ద దుకాణాలలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించే విధంగా చర్యలు చేపడుతూ ఆకస్మిక తనిఖీలు కూడా చేపట్టాలని తెలిపారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తొలగించాలంటే ప్రజలతో పాటు వ్యాపారస్తులు కూడా సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. లేనియెడల వ్యాపార దుకాణాలపై అధిక జరిమానా విధించబడునని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. (Story : ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించండి)