Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ సమాజ సేవలో పాత్రికేయుల పాత్ర అమోఘం

సమాజ సేవలో పాత్రికేయుల పాత్ర అమోఘం

0

సమాజ సేవలో పాత్రికేయుల పాత్ర అమోఘం

పాత్రికేయుల సంక్షేమ సంక్షేమ నిధికి ఐదు లక్షలు ఇవ్వనున్న సందా రాఘవ

పాత్రికేయులు ఐక్యమత్యంతో ముందుకు వెళ్లాలి…. సంధా రాఘవ.ఫోటో నెంబర్ 11

న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : సమాజ సేవలో పాత్రికేయుల పాత్ర అమోఘం అని, పాత్రికేయులు ఐక్యమత్యంతో ముందుకు వెళ్లి సమాజ అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని, పాత్రికేయుల సంక్షేమ నిధికి తన వంతుగా ఐదు లక్షల రూపాయలు ఇస్తానని సంధ రాఘవ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఈ సందర్భంగా సంధ రాఘవ మాట్లాడుతూ విలేకరులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వానికి ప్రజలకు వారదులుగా పాత్రికేయులు ఉంటున్నారని, ప్రజలకు సేవ చేయుటలో పాత్రికేయుల పాత్ర మరుపురానిదని వారు కొనియాడారు. సమాజ మార్పుకు పాత్రికేయుల గొప్ప పాత్ర వహిస్తూ, ఎనలేని సేవలు చేయడం మరుపు రానివని తెలిపారు. పాత్రికేయుల సలహాలు, సూచనలతోనే అభివృద్ధి చెందుతుందని, ప్రజలకు న్యాయం చేయాలన్న, చట్టపరంగా చేయాలన్న పాత్రికేయులే ముఖ్యపాత్ర వహిస్తున్నారని తెలిపారు. ప్రతి పాత్రికేయుడు ఆరోగ్య, విద్యా విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ప్రస్తుతమున్న కమిటీ భవిష్యత్తులో మరింత అభివృద్ధి బాటలో నడిపేందుకు పాత్రికేయుల కృషి ఎంతో అవసరమని వారు తెలిపారు. ప్రెస్ క్లబ్ కు కమిటీ మెంబర్లు కూడా పూర్తి దశలో సహకరించినప్పుడే ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుందని తెలిపారు. అదేవిధంగా పాత్రికేయుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఉన్న ప్రెస్ క్లబ్ కమిటీ విలేకరుల సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని, ఆ ఏర్పాటుకు తనవంతుగా ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని వారు హామీ ఇచ్చారు. ప్రభుత్వాలు మారిన పాత్రికేయుల యొక్క అభివృద్ధి అంతంత మాత్రమే ఉందని తెలిపారు. పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని వారు హామీ ఇచ్చారు. దసరా పండుగ పురస్కరించుకొని, అదేవిధంగా తన కూతురు సందా శ్రీనిత పుట్టినరోజు సందర్భంగా 43 మందికి నిత్యావసర సరుకులను తాను అందజేయడం తనకెంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు. భవిష్యత్తులో నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. తదుపరి ప్రెస్ క్లబ్ వారు సందా రాఘవ, సందా రవి లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జింక పురుషోత్తం, పూజారి జనార్ధన్, చందు, సాయి కే. హరి, పురుషోత్తం గౌడ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మోహన, కార్యదర్శి మురళిగౌడ్, కోశాధికారి నాగభూషణ తోపాటు ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, సీనియర్, జూనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు.(Story:సమాజ సేవలో పాత్రికేయుల పాత్ర అమోఘం)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version