డ్రోన్ షో ఏర్పాట్లును పరిశీలన కలెక్టర్ నిధి మీనా
న్యూస్ తెలుగు/విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్టోబర్ 22 సాయంత్రం పున్నమి ఘాట్, బబ్బురి గ్రౌండ్స్‌లో 5000 డ్రోన్లతో జరిగే డ్రోన్ షో ఏర్పాట్లును ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ నిధిమీనా, నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, సబ్ కలెక్టర్ కే.చైతన్య శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డ్రోన్ షోకు అవసరమయ్యే ఏర్పాట్లలో భాగంగా కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖులకు, ప్రజలకు కనులకు పండగ చేసే డ్రోన్ షోకు, పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ సిటీ ప్లానర్ ప్రసాద్, ఇంచార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సర్వే డిప్యూటీ ఇనస్పెక్టర్ బేగ్, డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్, సూపరిండెంటింగ్ ఇంజనీర్ సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఎస్‌ఎన్.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. (Story : డ్రోన్ షో ఏర్పాట్లును పరిశీలన కలెక్టర్ నిధి మీనా)