హోప్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో వికలాంగులకు వీల్ చైర్స్ పంపిణీ
జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్
న్యూస్ తెలుగు /ములుగు జిల్లా. (వై. లకుమయ్య ) : గత అయిదు రోజులుగా పర్యావరణ పరిరక్షణ అవగాహన పై నిర్వహిస్తున్న హెచ్ పి ఎల్ క్రికెట్ టోర్నమెంట్ లోభాగంగా, బుధవారం ములుగు జిల్లా పోలీస్, ములుగు జిల్లా క్రికెట్ అసోసియేషన్ తో ఛారిటీ మ్యాచ్ నిర్వహించడం జరిగింది. ఇందులో జిల్లా పోలీస్ వారు విజయం సాధించారు. ములుగు జిల్లా పోలీస్ తరుపున ముగ్గురు వికలాంగులకు వీల్ చైర్స్ జిల్లా ఎస్ పి డాక్టర్ శబరీష్ పంపిణి చేయటం జరిగింది. ములుగు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు దనసరి సూర్య హోప్ సంస్థ కార్యక్రమాలకు 20,000/- రూపాయలు విరాళంగా అందచేశారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలభారిన పడకుండా ఉండడానికి, క్రిడాలు ఎంతగానో ఉపయోగపడతాయి అని అన్నారు. హోప్ సంస్థ కార్యక్రమాలు ఎంతో బాగున్నాయని అని,మరెన్నో కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ములుగు డీ ఎస్పీ రవీందర్, ఏటూరునాగారం సి ఐ, అనుముల శ్రీనివాస్, ఎస్ తాజ్ ద్దీన్,,ములుగు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దనసరి సూర్య ,జిల్లా పోలీస్ అధికారులు ,హోప్ స్వచ్చంధ సంస్థ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కమిటి అధ్యక్షులు ఇ. వెంకన్న, మండల కమిటి అధ్యక్షులు రఘు, అప్సర్ పాషా ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. (Story : హోప్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో వికలాంగులకు వీల్ చైర్స్ పంపిణీ)