Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పల్లెవెలుగు బస్సులో షర్మిల

పల్లెవెలుగు బస్సులో షర్మిల

0

పల్లెవెలుగు బస్సులో షర్మిల

బస్సులో టిక్కెట్ కొని ఉచితం ఎప్పుడిస్తారు అంటూ కూటమి సర్కార్ కి సూటి ప్రశ్న
ఉచిత ప్రయాణం అమలు చేయాలని చంద్రబాబు కి పోస్ట్ కార్డు రాసిన పీసీసీ చీఫ్
APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

న్యూస్‌తెలుగు/విజయవాడ : – చంద్రబాబు అధికారంలో వచ్చి నాలుగు నెలలు అయింది
– అయినా ఉచిత బస్సు ప్రయాణం పై ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదు
– రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచిత ప్రయాణం ఎప్పుడు అని అడుగుతున్నారు
– తెలంగాణలో వారంలో అమలు చేశారు
– పథకం అమలు చేయడానికి ఇబ్బందులు ఏమిటి ?
– ఆర్టీసీ కి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని అని నా ?
– రాష్ట్రంలో ప్రతి రోజూ 20 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు
– రోజు మహిళల ద్వారా 7 కోట్ల ఆదాయం
– నెలకు 300 కోట్లు ఆదాయం
– ఉచిత ప్రయాణం కల్పిస్తే…ఈ 300 కోట్లు ఆర్టీసీ కి ఇవ్వాల్సి వస్తుంది అని భయమా ?
– మహిళల ఓట్లు తీసుకున్నారు
– హామీ ఇచ్చారు
– ఇప్పుడు మహిళల కోసం 300 కోట్లు ఖర్చు చేయలేరా ?
– మీ సూపర్ సిక్స్ హామీల్లో 4 పతకాలు మహిళలవే
– ఇందులో ఉచిత ప్రయాణం ఒక్కటే తక్కువ ఖర్చు
– ఇలాంటి తక్కువ ఖర్చు పథకం మీకు అమలు చేయడానికి ధైర్యం రావడం లేదు
– మీకు ఇష్టం వచ్చినప్పుడు అమలు చేస్తారా ?
– ఇదే అమలు చేయనప్పుడు ఇక పెద్ద పథకాల సంగతి ఏంటి?
– 5 ఏళ్లు ఇలానే కాలయాపన చేస్తారా ?


– ఎప్పుడు అమలు చేస్తారు అని ప్రజలు అడుగుతున్నారు
– ఉచిత బస్సు ప్రయాణం తో మహిళలకు భద్రత ఉంటుంది
– ఎంతో మంది మహిళలు బస్సులను ఆశ్రయిస్తారు
– ఇది చాలా మంచి పథకం
– చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం
– వెంటనే ఉచిత ప్రయాణం అమలు చేయండి
– అదే విధంగా మహిళల కోసం పెట్టిన పతకాలు వెంటనే అమలు చేయండి
– ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వండి
– ఇప్పటికే మార్కెట్ లో అన్ని ధరలు పెరిగాయి
– మహిళల మీద భారం పడుతుంది
– మహిళలకు భరోసా కావాలి
– మహిళలకు భద్రత విషయంలో ముందడుగు పడాలి
– రాష్ట్రంలో నెల రోజుల్లో హత్యాచారాలు మీద రిపోర్ట్ తీశాం
– అన్ని పెపర్ల నుంచి ఆర్టికల్స్ సేకరించాం
– బాట రేట్ల లెక్క మద్యం ధరలు తగ్గించారు
– 99 కే మద్యం ఇస్తే…. మహిళల మీద హత్యాచారాలు పెరుగుతాయి
– ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం కల్పించాలని ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డు పంపిస్తున్నాం
– రాబోయే రెండు మూడు రోజుల్లో పెద్ద ఎత్తన పోస్ట్ కార్డులు పంపిస్తాం
– ఇది చూసైనా వెంటనే చంద్రబాబు గారు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు. (Story : పల్లెవెలుగు బస్సులో షర్మిల) 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version