జాతీయ స్థాయి అండర్ 14 జూడో పోటీలలో చిగిచెర్ల విద్యార్థికి పతకం
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : జాతీయ స్థాయి అండర్ 14 జూడో పోటీలలో చిగిచెర్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థి అఫ్జల్ మెహరాజ్ అక్టోబర్ 4 వ తేది నుండి 8 వ తేది వరకు గుజరాత్ మెహసన లోని సర్ధార్ పటేల్ స్టేడియం లో జరిగిన 68 వ జాతీయ స్కూల్ గేమ్స్ పోటీలలో 50 కేజీల విభాగంలో అఫ్జల్ మెహరాజ్ కాంశ పతకం సాధించడం జరిగిందని పాఠశాల హెడ్మాస్టర్ తిమ్మారెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ ప్రతాపరెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ పోటీలలో మొత్తం దేశంలోని 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పాల్గొన్నాయి అని తెలిపారు. కాంస్య పథకం సాధించిన విద్యార్థిని పాఠశాల హెడ్ మాస్టర్ తిమ్మారెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ ప్రతాపరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు, పాఠశాల కమిటీ, తల్లిదండ్రులతోపాటు గ్రామ ప్రజలు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. (Story :” జాతీయ స్థాయి అండర్ 14 జూడో పోటీలలో చిగిచెర్ల విద్యార్థికి పతకం)