అమ్మ దర్శనం కోసం పోటెత్తిన భక్తులు
న్యూస్‌తెలుగు/విజయనగరం :ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలలో ప్రధాన ఘట్టమైన సిరిమాను పండగ వచ్చేవారమే కావడంతో పైడితల్లమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తులు మంగళవారం ఉదయం నుండే వనం, చదురు దేవాలయాద వద్ద బారులు తీరారు. ఆలయ ఈవో డివివి ప్రసాద్ రావు ఆధ్వర్యంలో పైడితల్లమ్మ వారికి వేకువజామున పంచామృతాభిషేకాలు నిర్వహించి పుష్పాలంకరణ చేశారు. పండగ సమీపిస్తున్న నేపథ్యంలో భక్తుల తాకిడి విపరీతంగా పెరగడంతో ఆలయ అధికారులు ఏర్పాటుచేసిన సామియాణాలు సైతం దాటాల్సి వచ్చింది. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అర్చకులు ఏడిద వెంకటరమణ పూజారి బంటుపల్లి వెంకట్రావు పూజలు నిర్వహించారు.
భక్తుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో ఆలయ సమీపంలో ప్రత్యేక వైద్య శిబిరం, మంచినీటి సదుపాయం తదితర పూర్తిస్థాయి మౌలిక వసతులను కల్పించారు. ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఆలయ సీనియర్ అసిస్టెంట్లు ఏడుకొండలు, మణికంఠ, ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. (sTORY : అమ్మ దర్శనం కోసం పోటెత్తిన భక్తులు )