ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
న్యూస్ తెలుగు/వనపర్తి : ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం ఐ.డి. ఓ.సి ప్రజావాణి హాల్లో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ యం నగేష్ తో కలిసి ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు.
కలక్టరేట్ ప్రజావాణి ఫిర్యాదులతో పాటు ముఖ్య మంత్రి కార్యాలయ ప్రజావాణి ఫిర్యాదులు, జిల్లా మంత్రి వర్యుల ప్రజావాణి ఫిర్యాదులు వస్తున్నాయని వాటన్నింటినీ సకాలంలో పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. రెవెన్యూ లో అత్యధికంగా పెండింగ్ లో ఉన్నాయని తక్షణమే పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. మొత్తం 70 ఫిర్యాదులు వచ్చాయి. ప్రతి సోమవారం చేనేత వస్తాలను వేసుకొని రావాలి
జిల్లాలోని చేనేత కార్మికులను ప్రోత్సహించడానికి ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరించి రావాలని అధికారులను సూచించారు. (Story : ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి)