నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
న్యూస్ తెలుగు/వనపర్తి : పెద్దమందడి మండలం ముందరితండా గ్రామపంచాయతీలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని సోమవారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారూ. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఆయనకు తండావాసులు బతుకమ్మతో డీజే శబ్దాల మధ్య సాంప్రదాయ నృత్యాలు చేస్తూ ఘనంగా స్వాగతం పలికారు. తండాలోని ప్రధాన కూడలి నుంచి గ్రామపంచాయతీ వరకు ఊరేగింపు చేపట్టారు. అనంతరం నూతన గ్రామపంచాయతీ భవనంతో పాటు సీసీటీవీ కెమెరాలను వలయాధికారి (ci) రాంబాబు పెద్దమందడి, ఖిల్లా ఘణపురం ఎస్సై లతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మొదటినుంచి తనతో పాటు రాజకీయంగా ప్రయాణం చేసి తాను ఎమ్మెల్యేగా గెలుపొందేందుకు పూర్తి స్థాయిలో సహకరించిన ముందరి తండా గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా సహకరిస్తానని ఎమ్మెల్యే తండా వాసులకు హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు పింఛన్లు రాయితీ సిలిండర్లు ఉచిత విద్యుత్ తో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారూ. కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్ గ్రామ మాజీ సర్పంచ్ జయంతి శంకర్, చీకరు చెట్టు తండా గ్రామ మాజీ సర్పంచ్ రాధాకృష్ణ, మాజీ జెడ్పిటిసి సభ్యులు కొమ్ము వెంకటస్వామి రమేష్ గౌడ్, మణిగిళ్ల తిరుపతిరెడ్డి, గట్టు యాదవ్, సుదర్శన్ రెడ్డి, జయపాల్ రెడ్డి, సక్రు నాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. (Story : నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే)