తొలి రోజే 15,176 బుక్కింగ్స్ తో ఎంజీ విండ్సర్ ఈవీ రికార్డ్
న్యూస్ తెలుగు/న్యూదిల్లీ: గురువారం, అక్టోబర్ 3, 2024న ఉదయం 7:30 గంటలకు బుక్కింగ్స్ ప్రారంభమైన నిముషాలలోనే భారతదేశపు మొదటి ఇంటిలిజెంట్ సీయూవీ, ఎంజీ విండ్సర్ ఈవీకి కస్టమర్ల నుండి అనూహ్యమైన ప్రతిస్పందన లభించింది. 24 గంటల లోగా, కంపెనీ 15,176 బుక్కింగ్స్ సంపాదించింది, అలాంటి విజయం సాధించిన ఎంజి విండ్సర్ ను భారతదేశపు 1వ ప్యాసింజర్ ఈవిగా చేసింది. ఈ సాధించిన విజయం భారతదేశపు మార్కెట్ లో ఫోర్-వీలర్ ఈవీల కోసం పెరుగుతున్న డిమాండ్ ను మరియు ఎలక్ట్రిక్ సంచారం వైపుగా మార్పును సూచిస్తోంది. సతీందర్ సింగ్ బజ్వా, ఛీఫ్ కమర్షియల్ ఆఫీసర్, జేఎస్ డబ్ల్యూ ఎంజి మోటార్ ఇండియా దీని గురించి వ్యాఖ్యానిస్తూ ఎంజి విండ్సర్ ను మనస్ఫూర్తిగా స్వీకరించిన, కేవలం ఒక రోజులోనే 15,176 బుక్కింగ్స్ మైలురాయికి చేరుకోవడానికి కారణమైన కస్టమర్లకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ విజయం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ లో ఒక పురోగమించే శక్తిగా ఎంజి విండ్సర్ స్థానాన్ని దృఢతరం చేసిందన్నారు. (Story : తొలి రోజే 15,176 బుక్కింగ్స్ తో ఎంజీ విండ్సర్ ఈవీ రికార్డ్)